అక్కడా ఇక్కడా అదే సీన్ ! అల్లర్లనే నమ్ముకున్న లోకేష్ ?
TeluguStop.com
అకస్మాత్తుగా ఎవరికైనా హైప్ రావాలి అంటే ఏదో ఒక సంచలనం చోటు చేసుకోవాల్సిందే ! ఇప్పుడు అంటువంటి సంచలనాల ద్వారానే తనకు , తన పార్టీకి మైలేజ్ తెచ్చుకోవాలి అన్నట్టు గా వ్యవహరిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
( Nara Lokesh ) ప్రస్తుతం యువ గళం పాదయాత్ర ద్వారా హైప్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్న లోకేష్ అధికార పార్టీ వైసీపీని( YCP ) టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేస్తున్నారు.
ఎప్పటిలాగే లోకేష్ , జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారన్నట్లుగా ప్రజల్లోనూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో, తన యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) జనాల దృష్టిని ఆకర్షించే విధంగా, రాజకీయ వర్గాల్లో చర్చ జరిగే విధంగా లోకేష్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.
అందుకే ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ, వైసిపి పై కవింపు చర్యలకు దిగుతున్నారు .
ఈ సందర్భంగా అనేక అల్లర్లు , గొడవలు లోకేష్ సమక్షంలో జరుగుతున్నాయి. """/" /
సొంత పార్టీ నేతలు ఈ వ్యవహారాలకు పాల్పడుతున్నా, లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అలాగే పోలీసులపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి.
కొద్దిరోజుల కిందట పుంగనూరు నియోజకవర్గంలో( Punganur ) పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
పుంగనూరు టౌన్ లోకి వెళ్లేందుకు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పోలీసులను బెదిరించి, నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పడిన కొట్లాటలో కొంతమంది పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు.పుంగనూరులో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా బాబు( Challa Babu ) ఆధ్వర్యంలో ఈ హింస జరిగినట్లుగా అనేక సాక్షాలు బయటకు వచ్చాయి.
"""/" /
ఇక అదే మాదిరిగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లోనూ( Bhimavaram ) అటువంటి సంఘటన చోటుచేసుకున్నాయి.
లోకేష్ పాదయాత్ర లో అనేక అల్లర్లు జరిగాయి .కర్రలు, బీర్ సీసాలతో వైసిపి నాయకులే లక్ష్యంగా దాడులు జరిగాయి.
అలాగే ఏపీ సీఎం జగన్ ఫ్లెక్సీలు( CM Jagan ) చించుతూ సీసాలు విసురుతూ ఆందోళన సృష్టించారు.
ఇక ఎవరిపై ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత పెద్ద పదవులు వారికి ఇస్తానంటూ లోకేష్ పదే పదే చెబుతుండడంతో దానిని స్ఫూర్తిగా చేసుకునే పుంగనూరు భీమవరంలో ఈ తరహా దాడులకు తెగబడ్డారని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు.
ఏది ఏమైనా పాదయాత్ర పేరుతో లోకేష్ పాదయాత్ర పైనే దృష్టి సాధించాల్సి ఉన్న, అల్లర్లు, ఆందోళన కార్యక్రమాలతో తన యాత్ర జనాల దృష్టిని ఆకర్షించే విధంగా లోకేష్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.