ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అల్లర్లు

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం( Darsi Assembly Constituency )లో అల్లర్లు చెలరేగాయి.

నియోజకవర్గంలోని బొట్లపాలెం, దేవవరంతో పాటు తూర్పు వీరాయపాలెంలో వైసీపీ, టీడీపీ( YCP, TDP ) నేతలు బాహాబాహికి దిగారు.

ఈ క్రమంలోనే పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలు అయ్యాయి.

దాంతోపాటుగా పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం మిషన్లు ధ్వంసం అయ్యాయని సమాచారం.దీంతో పోలింగ్ బూత్ ల వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు.ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?