దేశంలోని అత్యంత ధనిక భారతీయ గాయని ఈమేనా.. ఈమె ఆస్తుల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!
TeluguStop.com
మన ఇండియాలో ఎంతోమంది గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఒక్కొక్క పాటకు లక్షల్లో నుంచి కోట్లల్లో రెమ్యూనరేషన్ అందుకునే వారు కూడా ఉన్నారు.
మరికొందరు దశాబ్దాల పాటు వారి మధురమైన గానంతో ఎంతోమంది ఫాలోవర్స్ ని సంపాదించుకోవడంతో పాటు వివిధ భాషల్లో కూడా పాటలు పాడి ఆ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం భారత దేశంలో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, నేహా కక్కర్ లాంటి మహిళా గాయకులు రికార్డుల్లో ఉన్నారు.
లెజెండరీ ఆశా భోంస్లే( Asha Bhosle ) దశాబ్దాలుగా పాటలు పాడే ప్రేక్షకులను అలరించడంతోపాటు కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది.
"""/" /
భారతీయ సంగీత పరిశ్రమలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
ఈ గాయకులందరూ చాలా డబ్బు, కీర్తిని సంపాదించడంలో విజయం సాధించారు.అయితే భారతదేశంలో అత్యంత ధనిక మహిళా గాయని ఎవరు? అంటే ఆ పేరు ఇప్పటివరకూ మిస్టీరియస్ అని చెప్పాలి.
బయటి ప్రపంచానికి అంతగా తెలియని యువ గాయని ప్రముఖ గాయనీమణులందరి కంటే ముందు ఉంది.
ఆ గాయని మరెవరో కాదు తులసి కుమార్( Tulsi Kumar ).రూ.
200 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక మహిళా గాయని.
వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం.తులసి కుమార్ ప్రముఖ సినీ నిర్మాత భూషణ్ కుమార్( Bhushan Kumar ) సోదరి.
"""/" /
దివంగత గాయకుడు టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమా( Gulshan Kumar )ర్ కుమార్తె.
తన సోదరి కుశాలి కుమార్ నటి.తులసి కుమార్ నికర ఆస్తి విలువ నేటితరం ట్యాలెంటెడ్ యువగాయనీ మణులు శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, నేహా కక్కర్ మొదలైన వారి మొత్తం సంపద కంటే చాలా ఎక్కువ.
తులసి కుమార్ 2009లో లవ్ హో జాయే ఆల్బమ్‌తో సింగర్ గా కెరీర్ ను ప్రారంభించారు.
ఆ తరవాత అనేక సినిమాలకు పాటలు పాడారు.వాటిలో స్కూల్ లోని ముఝే తేరీ,బిల్లు లోని లవ్ మేరా హిట్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై లోని తుమ్ జో ఆయే లాంటి చార్ట్ బస్టర్ పాటలు ఉన్నాయి.
37 ఏళ్ల గాయని హితేష్ రాల్హాన్‌ను 2015లో వివాహం చేసుకున్నారు.కాగా సింగర్ శ్రేయ ఘోషల్ నికర ఆస్తి విలువ రూ.
180-185 కోట్లు.సునిధి చౌహాన్ నికర ఆస్తి విలువ రూ.
100 కోట్లకు పైగా ఉండగా, ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ రూ.
80 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం.సింగింగ్ సెన్సేషన్ నేహా కక్కర్ ఆస్తి విలువ దాదాపు రూ.
40 కోట్లు అని సమాచారం.వీళ్లందరి కంటే తులసి కుమార్ ఆస్తి విలువ ఎక్కువ.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్27, బుధవారం 2024