చ‌ర్మంపై స‌న్న‌ని చార‌లా? బియ్యం పిండితో నివారించుకోండిలా!

సాధార‌ణంగా కొంద‌రికి చ‌ర్మంపై తెల్ల‌గా స‌న్న‌ని చార‌లు ప‌డుతూ ఉంటాయి.అధిక బ‌రువు, పోష‌కాల లోపం, గర్భధారణ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మంపై చార‌లు ఏర్ప‌డుతుంటాయి.

ఈ చార‌లు చూసేందుకు చాలా అస‌హ్యంగా ఉంటాయి.అందుకే వీటిని నివారించుకునేందుకు ఖ‌రీదైన క్రీములు, ఆయిల్స్ వాడుతుంటారు.

అయితే పైసా ఖ‌ర్చు లేకుండా అంద‌రి ఇళ్ల‌ల్లో ఉండే బియ్యం పిండితో కూడా ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి బియ్యం పిండి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌లో బియ్యం పిండి, ఎగ్ వైట్ మ‌రియు బాదం ఆయిల్ వేసి బాగా క‌లుపు కోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చార‌లు ఏర్ప‌డిన ద‌గ్గ‌ర పూసి పావు గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో చ‌ర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే చార‌లు మ‌టు మాయం అవుతాయి.

/br. """/"/ అలాగే బియ్యం పిండి, బాగా పండిన అర‌టి పండు గుజ్జు మ‌రియు తేనె ఒక గిన్నెలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని చార‌లు ఉన్న చోట అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో చ‌ర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే చార‌లు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

ఇక రెండు స్పూన్ల బియ్యం పిండిలో ఒక స్పూన్ చ‌ప్పున పుదీనా ర‌సం, నిమ్మ ర‌సం మ‌రియు కొబ్బ‌రి నూనె వేసి క‌లుపు కోవాలి.

ఇప్పుడు చారలు ప‌డిన చోట ఈ మిశ్ర‌మాన్ని అప్లై చేసి.బాగా ఆర‌నివ్వాలి.

అనంత‌రం కూల్ వాట‌ర్‌తో నీట్‌గా వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా.

చ‌ర్మంపై ప‌డిన స‌న్న‌ని చార‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?