పాదాల పగుళ్లను నివారించే బియ్యంపిండి.. ఎలాగంటే?
TeluguStop.com
వింటర్ సీజన్ రానే వచ్చింది.ఇప్పటికే చలికి ప్రజలు వణికిపోతున్నారు.
ఈ సీజన్‌లో చలి మాత్రమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు కూడా వెంటాడుతూ వేధిస్తుంటాయి.
ఇదిలా ఉంటే.ఈ చలి కాలంలో పాదాల పగుళ్ల సమస్య తెగ ఇబ్బంది పెడుతుంటుంది.
పాదాల పగుళ్ల కారణంగా ఒక్కో సారి నడవడానికే చాలా కష్టంగా, నొప్పిగా ఉంటుంది.
పాదాల్లో నూనె గ్రంధులు ఉండకపోవడం వల్ల.చలి ప్రభావంతో పగిలిపోతూ ఉంటాయి.
అయితే బియ్యం పిండితో పాదాల పగుళ్ల సమస్యను సులువుగా నివారించుకోవచ్చు అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ బియ్యం పిండి, పావు స్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా తేనె మరియు యాపిల్ సిడార్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి.బాగా ఆరనివ్వాలి.
ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకుని.
తడిలేకుండా తుడుచుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల పగుళ్ల సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
ఇక కేవడంతో బియ్యం పిండితోనే కాదు.మరికొన్ని విధాలుగా కూడా పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు.
బొప్పాయి పాదాల పగుళ్లకు చెక్ పెట్టగలవు.అందువల్ల ఒక బౌల్‌లో బొప్పాయి గుజ్జు మరియు నిమ్మరసం బాగా మిక్స్ చేసుకుని.
పాదాలకు పట్టించాలి.ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గడంతో పాటు మృదువుగా కూడా మారతాయి.అలాగే ముల్తానీ మట్టి ముఖానికి కాదు పాదాలకు కూడా బాగా సహాయపడుతుంది.
ఒక బౌల్‌లో ముల్తానీ మట్టి, పెరుగు మరియు గులాబీ రసం వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పాదాలకు రుద్ది.కాసేపు ఆరనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో పాదాలకు వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల కూడా పాదాల పగుళ్ల సమస్యకు స్వస్తి పలకొచ్చు.
పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు వెన్నలా కరిగిపోవాలంటే ఈ డ్రింక్ ను తీసుకోండి!