ముడతలను తగ్గించే రైస్ క్రీమ్..ఎలా చేసుకోవాలో తెలుసా?
TeluguStop.com
ఇటీవల రోజుల్లో ముప్పై ఏళ్లు దాటాయంటే చాలు ముడతలు మహా చిరాకు పుట్టిస్తాయి.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పులు, పోషకాల కొరత, కాలుష్యం, స్కిన్ కేర్ లేక పోవడం, కెమికిల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రోడెక్ట్స్‌ను వినియోగించడం, పలు రకాల మందులు వాడటం, స్మోకింగ్.
ఇలా రకరకాల కారణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడుతుంటాయి.దాంతో వీటిని నివారించుకునేందుకు మార్కెట్‌లో లభ్యమయ్యే ఎన్నెన్నో క్రీములను కొనుగోలు చేసి వాడుతుంటారు.
"""/" /
అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో తయారు చేసుకునే రైస్ క్రీమ్ తో ముడతలను నివారించుకోవచ్చు.
మరి లేట్ ఎందుకు రైస్ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.ముందుగా బౌల్ తీసుకుని అందులో కడిగిన బియ్యం రెండు స్పూన్లు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని రెండు గంటల పాటు నాన బెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్‌లో వాటర్‌తో సహా బియ్యాన్ని రుబ్బుకుని.రైస్ వాటర్‌ను ఫిల్టర్ చేసుకోవాలి.
అనంతరం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఫిల్టర్ చేసుకున్న రైస్ వాటర్ పోసి స్పూన్‌తో బాగా తిప్పుకుంటూ దగ్గర పడే వరకు స్లో ఫ్లేమ్‌పై ఉడికించుకుంటే.
క్రీమ్ సిద్ధమైనట్టై.ఇక ఈ రైస్ క్రీమ్‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలో కూడా చూసేయండి.
ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ రైస్ క్రీమ్, ఒక స్పూన్ అలోవెర జెల్, అర స్పూన్ బాదం ఆయిల్, ఒక స్పూన్ చందనం పౌడర్, ఒక స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుని.ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా పూసుకోవాలి.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.అప్పుడు కూల్ వాటర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజూ చేస్తే గనుక ముడతలు పోవడమే కాదు ముఖం తేమగా, యవ్వనంగా మెరిసి పోతుంది.
ఏవైనా మచ్చలు ఉన్నా క్రమంగా మటుమాయం అవుతాయి.
డైరెక్టర్ శంకర్ భవిష్యత్తును డిసైడ్ చేయనున్న ఇండియన్3 మూవీ.. ఏం జరిగిందంటే?