టూరిస్టులకు చావు భయం ఏంటో చూపించిన ఖడ్గమృగం.. హార్ట్‌స్టాపింగ్ వీడియో మీకోసం..!

ఖడ్గ మృగాలు చాలా శక్తివంతమైనవి.ఒక పెద్ద ఖడ్గమృగం పది సింహాలనైనా పరుగులు పెట్టించగలదు.

ఇవి మూడు టన్నులకు పైగా బరువు ఉంటాయి.అలాగే ఆరున్నర అడుగుల పైగా ఎత్తుండే ఇవి భూప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైనవిగా పేరు పొందాయి.

ముఖ్యంగా వీటికి ముందు భాగంలో ఉండే కొమ్ము అత్యంత పదునుగా, దృఢంగా ఉంటుంది.

40 ఇంచుల వరకు పొడవు పెరిగే ఈ కొమ్ముతో బలంగా కుమ్మేస్తే ఎంతటి పెద్ద జంతువైనా చచ్చిపోవాల్సిందే.

ఏనుగులు కూడా వీటి జోలికి వెళ్లేందుకు బయటపడుతుంటాయి.ఇవి పెద్ద భారీ కాయంతో ఉన్నప్పటికీ.

సుమారు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.విశేషమేంటంటే ఇవి ఎంత సేపు పరిగెత్తినా అలసిపోవు.

అందుకే, వీటి జోలికి వెళ్లకూడదు.కానీ కొందరు టూరిస్టులు మాత్రం ఒక ఖడ్గమృగాన్ని గెలికి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

దాంతో వీరిని వదిలిపెట్టకుండా ఖడ్గమృగం చాలా సేపు వెంటాడింది.అదృష్టవశాత్తూ వీరు ఒక జీపులో ఉండటంతో ప్రాణాపాయం తప్పింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల గుండె ఆగేలా చేస్తోంది.వైరల్ అవుతున్న వీడియోలో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో కొందరు టూరిస్టులతో కలిసి వెళ్తున్న ఒక జీపును చూడొచ్చు.

అయితే వీరికి ఒక ఖడ్గమృగం తారసపడింది.అప్పుడే వీళ్లు తమ దారిన తాము వెళ్లకుండా ఖడ్గమృగాన్ని రెచ్చగొట్టినట్లు ఉన్నారు.

అందుకే అది జీపు వెంటపడటం మొదలెట్టింది.మొదట్లో రహదారికి పక్కన పరిగెత్తిన ఈ ఖడ్గమృగం ఆ తర్వాత రహదారి మీద కొచ్చి జీపుని చేజ్ చేయడం ప్రారంభించింది.

అత్యంత వేగంగా పరిగెడుతూ అది జీప్‌కు సమీపిస్తుండటంతో టూరిస్టుల పైప్రాణాలు పైనే పోయాయి.

దూసుకొస్తున్న ఖడ్గమృగాన్ని చూసి లేడీ టూరిస్టులు హడలిపోయారు."భయ్యా వేగంగా డ్రైవ్ చెయ్యి, భయ్యా ప్లీజ్ భయ్యా, ఓరి నాయనో ఓరి దేవుడో, మా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి" అని వాళ్లు డ్రైవర్ ని ప్రాధేయపడుతున్నట్టు కూడా ఈ వీడియోలో వినిపించింది.

ఏ క్షణాన రోడ్డు బ్లాక్ వచ్చినా జీప్ ఆగిపోతే దానిపై ఖడ్గమృగం దాడి చేయడం ఖాయం.

రైనో ముందు ఎంత గట్టి వాహనమైనా తుక్కు అయిపోతుంది.ఒక్కసారి తన కొమ్ముతో కుమ్మేస్తే కారు అయినా, చిన్నపాటి లారీలైనా పనికిరాకుండా అప్పడం అయిపోతాయి.

అందుకే జీప్‌లో ప్రయాణిస్తున్న టూరిస్టులు ప్రాణభయంతో వణికిపోయారు.అయితే ఇది దాదాపు రెండు కిలోమీటర్ల పాటు వాహనాన్ని వెంటాడింది.

చివరికి ఎలాగోలా డ్రైవర్ స్పీడ్ పెంచి వాళ్లని ప్రాణాలతో గట్టెక్కించాడు.దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఖడ్గమృగంతో పెట్టుకుంటే ప్రాణాలపై ఆశలు వదిలేసు కోవాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి ఖడ్గమృగాలు స్వచ్ఛమైన శాఖాహారులు.ఇవి క్వింటాళ్ల చొప్పున ఆకులు, అలములు మేస్తుంటాయి కానీ ఏ జంతువుకి హాని చేయవు.

ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాయి.కానీ ఏదైనా హాని జరుగుతుందని తెలిస్తే ప్రత్యర్థులను చిత్తు చేయకుండా వెనుకడుగు వేయవు.

వీటికి పెద్ద శత్రువులుగా మానవులే మారుతున్నారు.వీటికి ఉన్న కొమ్ముల్లో ఔషధ గుణాలు ఉంటాయనే కొన్ని అపోహల వల్ల చాలామంది వీటి కోసం ఎగబడుతున్నారు.

ఇలా కొమ్మలకు డిమాండ్ పెరగడంతో వేటగాళ్లు వీటి ప్రాణాలు తీస్తున్నారు.మత్తు మందులు ఇచ్చి వీటి కొమ్మలు కోసేయడం లేదా తుపాకులతో కాల్చి చంపడం చేస్తున్నారు.

దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.ఇవి అంతరించి పోవడానికి మరో అడుగు దూరంలో ఉన్నాయి.

కజిరంగా నేషనల్ పార్క్‌లో కూడా వేటగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.అందుకే మనుషులను చూడగానే ఇక్కడి రైనోలు కోపంతో ఊగిపోతున్నాయని తెలుస్తోంది.

ఆ విషయంలో అనసూయ స్ట్రిక్ట్..ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు: హైపర్ ఆది