ఖడ్గమృగం దెబ్బకు పటాపంచలైన జనం… పలువురికి గాయాలు!

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.అందుకొని ఫన్నీగా ఉంటే, కొన్ని భయానకంగా ఉంటాయి.

మరికొన్ని కాస్త ఆశ్చర్యంగా ఉంటే, కొన్ని చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంటాయి.ఇక తాజాగా వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే మనకైతే నవ్వొస్తుంది కానీ, బాధితులకు మాత్రం చాలా భయానకంగా ఉందని చెప్పొచ్చు.

ఓ రకంగా చెప్పాలంటే వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు అంటే అతిశయిక్తి కాదేమో.

"""/" / అవును, వైరల్ అవుతున్న సదరు వీడియోని గమనిస్తే, ఒక ఖడ్గమృగం గుంపుగా ఉన్న జనాన్ని తరిమి, తరిమి కొట్టడం గమనించవచ్చు.

ఖడ్గమృగం ధాటికి దీంతో వారు ఉరుకులు, పరుగులు తీయడం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.

ఈ సంఘటనలో ఇద్దరు గాయపడ్డారని కూడా తెలుస్తోంది.అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరగగా తాజాగా వెలుగు చూసింది.

శుక్రవారం మోహిమా గ్రామంలోకి ఖడ్గమృగం వచ్చి, నానా యాగీ చేసిందని స్థానికులు వాపోతున్నారు.

"""/" / స్థానికులు ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ గ్రామానికి వెళ్లి ఖడ్గమృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

అయితే అది వారిపై కూడా దాడి చేయడం గమనార్హం.ఈ సంఘటనలో డివిజనల్ అటవీ అధికారి సుశీల్ కుమార్ ఠాకూరియా, మరో అధికారి గాయపడ్డారని సమాచారం.

ఖడ్గమృగం జనాన్ని తరుముతుండగా చెట్టుపై ఉన్న వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో దీనిని రికార్డ్‌ చేశాడు.

దాంతో ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

భారత సంతతి వ్యక్తికి ప్రతిష్టాత్మక ‘‘ యూకే పీఎం పాయింట్స్ ఆఫ్ లైట్ ’’ అవార్డు