తప్పుడు కేసులో తనను ఇరికించారంటున్న రియా?

సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో నార్కోటిక్ పోలీసులు ఇప్పటికే రియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

డ్రగ్స్ డీలర్లతో రియాకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో పోలీసులు రియాను అరెస్ట్ చేశారు.

రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి ఇప్పటికే రియా అరెస్ట్ గురించి స్పందిస్తూ రియా బెయిల్ పిటిషన్ కూడా రిజెక్ట్ అయిందని.

తాను చనిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా రియా చక్రవర్తికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

రియా తనను తప్పుడు కేసులో ఇరికించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం రియా ముంబై నగరంలోని బైకుల్లా జైలులో ఉన్నారు.

జైలులో తనకు ప్రాణ భయం ఉందని.బెయిలబుల్ నేరాలే తనపై మోపారు కాబట్టి తక్షణమే తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోరుతున్నారు.

బెయిల్ పిటిషన్ లో తాను ఏ తప్పు చేయకపోయినా తప్పుడు కేసులో ఇరికించారని పేర్కొన్నారు.

"""/"/ రియా బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం రోజున మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.

దీంతో రియా ఎన్.డీ.

పీ.ఎస్ కోర్టును ఆశ్రయించి తాను అమాయకురాలినని పేర్కొంది.

రియా తరపు లాయర్ సతీష్ మనే షిండే రియాను పురుష అధికారులు మాత్రమే ప్రశ్నించారని పేర్కొన్నారు.

కానిస్టేబుల్, పోలీస్ మహిళా అధికారి లేకుండా విచారణ జరిగిందని ప్రత్యేక కోర్టుకు బెయిల్ పిటిషన్ ద్వారా తెలిపారు.

నేడు ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రానుంది.రియాతో పాటు రియా సోదరుడు షోవిక్ తరపున కూడా బెయిల్ పిటిషన్ దాఖలైంది.

మరోవైపు సుశాంత్ మృతి కేసులో సుశాంత్ సోదరి ప్రియాంకపై రియా సంచలన ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

డ్రగ్స్ కేసులో రియాపై ఆమె సోదరునిపై నేరం రుజువైతే పది సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు…