తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆర్జీవీ అలాంటి ప్రశ్నలు అడిగాడట.. షాకింగ్ విషయాలు చెప్పిన సోదరి!

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన ఆర్జీవీ మిగతా డైరెక్టర్లకు భిన్నమనే సంగతి తెలిసిందే.

ఆర్జీవీ ఏ సెలబ్రిటీని ఎప్పుడు పొగుడుతారో ఏ సెలబ్రిటీని ఎప్పుడు తిడతారో ఎవరూ చెప్పలేరు.

భీమ్లా నాయక్ సినిమా విషయంలో కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్లు చేసిన ఆర్జీవీ సినిమా రిలీజ్ సమయంలో మాత్రం పాజిటివ్ ట్వీట్లు చేయడం గమనార్హం.

అయితే తాజాగా ఆర్జీవీ సోదరి ఒక ఇంటర్వ్యూలో ఆర్జీవీ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఆర్జీవీ సోదరి విజయ లక్ష్మి ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆర్జీవీ బాల్యం నుంచే భిన్నంగా ఆలోచించేవారని చెప్పుకొచ్చారు.

ఆర్జీవీని అర్థం చేసుకోవడం సులువు కాదని ఆర్జీవీ ఎవరికీ అర్థమయ్యే వాడు కాదని ఆమె కామెంట్లు చేశారు.

తొమ్మిదేళ్ల వయస్సులో ఆర్జీవీ తెలివి తేటలు చూసి తాము ఆశ్చర్యపోయామని ఆమె చెప్పుకొచ్చారు.

ఒకసారి తాను, వర్మ, మామయ్యతో కలిసి సినిమాకు వెళ్లామని ఆమె అన్నారు. """/" / సినిమా పూర్తైన తర్వాత వర్మ సినిమాలో రైలును బ్లాస్ట్ చేయడం కోసం టైమ్ బాంబ్ ను ఫిక్స్ చేసిన సీన్ గురించి మాట్లాడుతూ మన దేశంలో రైలు ఎప్పుడైనా సరైన సమయానికి వస్తుందా అని అన్నారని ఆమె కామెంట్లు చేశారు.

ఏ విషయం గురించైనా వర్మ చాలా లాజికల్ గా ఆలోచిస్తాడని ఆమె వెల్లడించడం గమనార్హం.

ఏ విషయం గురించి మాట్లాడినా ఎస్ ఆర్ నో అనే పదాలతో ఆర్జీవీ తేల్చేస్తాడని ఆమె చెప్పుకొచ్చారు.

వర్మ చేసే పనులు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని విజయలక్ష్మి అన్నారు.

తర్వాత రోజుల్లో వర్మ మైండ్ సెట్ కు తాము ట్యూన్ అయ్యామని ఆమె తెలిపారు.

వర్మ రహస్యాల గురించి విజయలక్ష్మి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆర్జీవీ బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్లలో శ్రీ రాపాకకు తన మద్దతు ప్రకటించారు.

దిల్ రాజు స్టార్ట్ చేసిన వెబ్ సైట్ పరిస్థితి ఏంటి..?