విడాకులు స్వర్గంలో జరుగుతాయంటున్న ఆర్జీవీ.. వైరల్!

ప్రముఖ తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.ఈయన పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈయన ఎన్నో సినిమాలలో దర్శకత్వం వహించి మంచి సక్సెస్ అందుకోగా.బయట మాత్రం తన మాటలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు.

ఇక ఈయన సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే.

ఈయన ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం అది ఓ సెన్సేషనల్ గా మారుతుంది.

ఎందుకంటే ఆయన పెట్టే పోస్టులు అలా ఉంటాయన్నమాట.నిజానికి ఆయన పెట్టే కొన్ని పోస్టులు అర్ధవంతంగా ఉంటాయి.

మరికొన్ని మాత్రం అసలు అర్థం కాక తల పట్టుకునేలా ఉంటాయి.ఇక సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలపై బాగా కౌంటర్లు వేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ.

ఇదిలా ఉంటే తాజాగా వివాహాలు, విడాకులు అంటూ ఓ ట్వీట్ చేశాడు.నిజానికి ఆయన ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ అంటే ఆసక్తి చూపని వ్యక్తి.

దీని గురించి తాజాగా ఓ ట్వీట్ చేయగా వైరల్ గా మారింది.ప్రేమ అంటే ఆనందం.

వివాహమనేది తలనొప్పి.విడాకులు అంటే స్వర్గమని అంటూ, అన్ని వాహనాలు నరకంలో జరుగుతాయని, విడాకులు స్వర్గంలో జరుగుతాయని నిజాయితీగా నమ్ముతున్నాను అంటూ.

వివాహితులు అందరు ఇది నిజమని ఒప్పుకుంటారని చాలెంజ్ చేసి చెబుతున్నాను అంటే వర్మ తన స్టైల్లో ఓ కామెంట్ చేశాడు.

ఇది చూసిన నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు.గతంలో కూడా ప్రేమ పెళ్లి గురించి ఇలాంటిదే ఓ విషయాన్ని తెలిపాడు.

లవ్ మ్యారేజ్ అయినా.అరేంజ్డ్ మ్యారేజ్ అయినా దానంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదని అందరికీ షాకిచ్చాడు.

ఇక తాను పెళ్లి ఎందుకు వద్దంటున్నాడో‌‌.పెళ్లైన వాడిని అడుగుతే తెలుస్తుందని కామెంట్ చేశాడు.

అంతే కాకుండా దానికి ఓ కొటేషన్ కూడా తగిలించాడు.నిప్పు చాలా అందంగా ఉందని పట్టుకుంటే కాలిపోద్ది.

పెళ్లి కూడా అలాంటిదే అని పెళ్లి గురించి వ్యతిరేకంగా స్పందించాడు వర్మ.

అల్లు అర్జున్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అంత సంపదించారా?