నీలాగా నువ్వు ఆలోచించు.. ఎవ్వరిని ఫాలో అవ్వొద్దు : ఆర్జీవీ

టాలీవుడ్ డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ ఒకరు.ఈయన గతంలో మంచి మంచి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కానీ ఆ తర్వాత మాత్రం బి గ్రేడ్ సినిమాలు తీయడమే కాకుండా వరుస ప్లాప్స్ అందుకుంటూ కెరీర్ లో వెనుకబడి పోయాడు.

అలాగే ఆయనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి వివాదాస్పద దర్శకుడిగా మారిపోయాడు.

ప్రతి విషయంలో కల్పించుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.అయితే ఈయన ముక్కుసూటిగా మాట్లాడే విధానానికి ఈయనకు భారీ ఫాలోయింగ్ ఉంది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ పై రచయిత కాంత్ రిసా ఒక పుస్తకాన్ని రాసారు.

ఆ పుస్తకాన్ని ఆర్జీవీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఆర్జీవీ ది బ్లు బుక్ అనే టైటిల్ లో రచించిన ఈ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి, ఐఏఎస్ ఫనీంద్ర, రైటర్ సిరాశ్రీ, జర్నలిస్టులు వైజయంతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.నేను ఎవ్వరిని సీరియస్ గా తీసుకోను.

"""/" / బ్లు బుక్ రాసారు అని నాకు ఎవరో చెబితే బ్లు ఫిలిం తెలుసు బ్లు బుక్ ఏంటి రా అనుకున్నాను.

బ్లు అంటే ఫిలాసఫీ అని ఏదో అన్నారు.మన పెద్దలను, టీచర్స్ చెప్పే వాటిని వినకూడదు అని నా పాలసీ.

ఎన్నో పుస్తకాలను చదివిన తర్వాత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. """/" / ఎవ్వరిని ఫాలో అవ్వొద్దు.

నీకు నీలా ఉండు అని అన్నారు.నన్ను చాలా మంది మంచి సినిమా తియ్యండి అని అడుగుతూ ఉంటారు.

అయితే వాళ్ళు నా మీద పెట్టే శ్రద్ధ, సమయం వాళ్ళ పనుల మీద పెట్టుకుంటే బెటర్ అని అనుకుంటాను.

నా ఉద్దేశం సక్సెస్ అనేది ఒక రోజు లో మీకు నచ్చినట్టు జీవించడం.

మనల్ని తప్పు అని చెబుతున్న వాళ్లకు అది తప్పో ఒప్పో కూడా వాళ్లకు తెలియదు.

వాళ్ళ మీద కూడా ఎవరో రుద్దారు.ఎవరో చెప్పినది కాకుండా నీలాగా నువ్వు ఆలోచించు అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ.

భట్టి మాటలన్నీ వట్టి మాటలే.. హరీశ్ రావు