మతం మార్చుకున్న తర్వాతే ఏఆర్ రెహమాన్ గొప్పోడయ్యాడు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఏఆర్ రెహమాన్( AR Rahman ) ప్రస్తుతం ఎక్కువ సినిమాలు చేయకపోయినా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు ఏఆర్ రెహమాన్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ వస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ అనే సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ రెహమాన్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నేను దేవుడిని నమ్మనని దేవుడిని నమ్మితే నేను చాలా పాపాలు చేయలేనని ఆర్జీవీ ( RGV )అన్నారు.

నాకు పాపాలు చేయడం ఇష్టం కాబట్టి దేవుడిని నమ్మనని ఆయన తెలిపారు.దేవుడిని నమ్మకపోతే ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చని వర్మ అన్నారు.

మనకు ఏదో ఒకటి అనుకోనిది జరుగుతుందని కరోనా కొత్తగా వచ్చింది కాబట్టి మనం భయపడతామని ఆయన కామెంట్లు చేశారు.

ప్రతి ఒక్కరూ అమెరికాకు వెళ్లాలని కోరుకుంటారు కాబట్టి అమెరికన్లు నమ్మే దేవుడు తన దృష్టిలో గ్రేట్ అని వర్మ అన్నారు.

"""/" / ఏఆర్ రెహమాన్ హిందూ అని దిలీప్ ( Dileep )అతని అసలు పేరు అని సాయిబాబా బాలాజీ టెంపుల్ ( Saibaba Balaji Temple )కు వెళ్లే అతను ఆ తర్వాత మతం మారాడని మతం మారిన వెంటనే సూపర్ హిట్ అయ్యాడని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు గారు సాయిబాబాను పూజించడంతో ఏఆర్ రెహమాన్ లా ట్రై చేయొచ్చు కదా అని అన్నానని వర్మ అన్నారు.

హిందువులు మతం మారతారు కానీ ముస్లింలు, క్రిస్టియన్లు ఎప్పుడూ మతం మార్చలేదని ఆయన తెలిపారు.

"""/" / ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని నమ్ముతారని వర్మ అన్నారు.ఒక వ్యక్తి సముద్రంలో చనిపోతుంటే దేవుడు కాపాడాడని అప్పటినుంచి దేవుడిని నమ్ముతున్నానని చెప్పాడని వర్మ తెలిపారు.

ఆ సమయంలో నేను నువ్వు చచ్చిపోయి ఉంటే చేపలు నిన్ను తినేవి కదా చేపలు అన్నీ నాస్తికులు అయిపోవాలా అని అన్నానని వర్మ చెప్పుకొచ్చారు.

దేవుడు లేకపోతే సొసైటీని పట్టుకోవడం కష్టం అని ఆయన తెలిపారు.దేవుడిని ఎవరూ బ్లేమ్ చేయరని ఆయన పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ను అలాంటి పాత్రలో చూడాలనుకుంటున్న ఆయన అభిమానులు…