శ్రీదేవితో ఒకప్పటి ఫోటో షేర్ చేసుకున్న ఆర్జీవి.. అది మాత్రం నీ కళ్ళకు కనపడదంటూ కామెంట్స్?
TeluguStop.com
ఆర్జీవి పేరు వినిపిస్తే చాలు అక్కడ ఏదో సెన్సేషనల్ వార్త ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది.
టాలీవుడ్ లో కాంట్రవర్సీ డైరెక్టర్ గా ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు వర్మ.
మొదట్లో మంచి మంచి కంటెంట్ లు ఉన్న సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.
అంతేకాకుండా ఎంతోమంది హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసి ప్రస్తుతం వారిని స్టార్ హోదాలో ఉండేలా చేశాడు.
కానీ ఏం జరిగిందో తెలియదు.గత కొన్ని రోజుల నుండి వర్మ స్టైల్ మొత్తం మారిపోయింది.
ఆయన ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయి.ఆయన తీసే సినిమాలు కూడా కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి.
చాలావరకు ఆయన తీసే సినిమాలు సె** కు సంబంధించినట్లుగా అనిపిస్తున్నాయి.ఇక ఈయనకు హీరోయిన్ శ్రీదేవి అంటే చాలా అభిమానం.
ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే శ్రీదేవి గురించి ఖచ్చితంగా ఏదో ఒక విషయం చెబుతూనే ఉంటాడు.
నిజానికి వర్మ ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న కూడా ఆ ఇంటర్వ్యూ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో లేడీ యాంకర్స్ ఉంటే మాత్రం వెంటనే వాళ్లు వర్మ ఇంటర్వ్యూ తో సెలబ్రిటీగా మారడం ఖాయం.
ఇప్పటికే చాలామంది లేడీ యాంకర్లు ఆయనను ఇంటర్వ్యూ చేసి సెలబ్రిటీ హోదాలో దూసుకెళ్తున్నారు.
ఎందుకంటే ఈయన ఇంటర్వ్యూ అంత బోల్డ్ గా ఉంటుంది కాబట్టి.ఆ ఇంటర్వ్యూలో మొత్తం సె** ల గురించే మాట్లాడుతాడు.
నిజానికి నోరు తెరిస్తే చాలు ఆయన నోటి నుంచి అదే పదం వస్తుంది.
అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్ లో పాల్గొన్న కూడా ఆయన వీటి గురించి చాలా చర్చలు చేస్తూ ఉంటాడు.
"""/"/
ఇటువంటి గురించి ఏమైనా ప్రశ్నలు ఎదురైతే చాలు ఎటువంటి మొహమాటం పడకుండా మాట్లాడుతాడు.
అలా ఈయన గురించి చెప్పుకుంటూ పోతే అన్ని కాంట్రవర్సీలే ఉంటాయి.ఇక వర్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
రాజకీయ నాయకులను ఉద్దేశించి నెగటివ్ కామెంట్లు, ట్రోల్స్ చేస్తూ ఉంటాడు.అంతేకాకుండా అమ్మాయిల ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటాడు.
వారి థైస్ అందాలను చూపిస్తూ అందరి దృష్టిలో పడతాడు.నిజానికి అమ్మాయిలు కూడా ఆయన వెంట అలా పడుతుంటారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన తన ఇన్ స్టాలో ఒక ఫోటో షేర్ చేసుకున్నాడు.
క్షణం క్షణం మూవీ సమయంలో వెంకటేష్, శ్రీదేవి లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసుకుంటూ ఒకప్పటి మెమోరీస్ అని గుర్తుకు చేసుకున్నాడు.
"""/"/
ఇక ఆ ఫోటోను చూసిన నెటిజన్స్ కొందరి లైక్స్ కొట్టగా మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.
అయితే ఓ నెటిజన్.అంతే ఇక పాత ఫొటోస్ పెట్టుకోవడమే.
లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తున్న అని భ్రమలో ఉన్నారు.కానీ లైఫ్ ను స్పాయిల్ చేసుకున్న అని మాత్రం మీ కళ్ళకు కనబడదు.
ఎందుకంటే అంత మూసుకొని పోయాయి.అని కామెంట్ చేయగా.
అవును ఇదంతా నిజమే అని మరి కొంతమంది అంటున్నారు.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!