పెళ్లి ఒక జబ్బు.. విడాకులు దానికి మెడిసిన్.. ఆర్జీవీ ట్వీట్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంతల డైవర్స్ గురించి అందరు చర్చించుకుంటున్నారు.

క్రేజీ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఇలా సడెన్ గా ఎవరి దారి వారు చూసుకోవడంపై అందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇదే విషయంపై ఇన్ డైరెక్ట్ గా స్పందించారు సంచలన దర్శకుడు ఆర్జీవి.

తన ట్విట్టర్ లో పెళ్లి.విడాకులు అనే అంశంపై కామెంట్స్ చేశారు.

పెళ్లి ఒక జబ్బు లాంటిదని.విడాకులే దానికి మందు అని చెప్పాడు వర్మ.

పెళ్లిని బ్రిటీష్ పాలనలో పోల్చిన వర్మ.విడాకులు స్వాతంత్రం అని అన్నారు.

హిట్లర్ యుద్ధాన్ని ప్రారంభించడాన్ని పెళ్లి అని భావిస్తే.గాంధీ స్వాతంత్రం సాధించడాన్ని విడాకులు అని అన్నారు.

అంతేకాదు పెళ్లిల్లు నరకంలో జరుగుతాయని.విడాకులు స్వర్గంలో జరుగుతాయని అన్నారు.

అందుకే పెళ్లి కంటే విడాకులు తీసుకున్నప్పుడే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలని అన్నారు.సంగీత్ వంటి కార్యక్రమాలు చేసుకోవాల్సింది విడాకుల టైం లోనే అని విడిపోయిన పురుషులు, స్త్రీ ఆ టైం లో హాయిగా ఆడిపాడాలని అన్నారు.

 ఖచ్చితంగా ఆర్జీవి చేసిన ఈ ట్వీట్ నాగ చైతన్య, సమంతల గురించే అని తెలుస్తుంది.

అయితే వారి పేర్లని మెషన్ చేయకుండా ఆర్జీవి పెళ్లి సిద్ధాంతాన్ని చెబుతున్నాడు.

విడాకుల గురించి సలహా అడిగిన యువతి.. చిరంజీవి కూతురు రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!