కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటున్న రామ్ గోపాల్ వర్మ
TeluguStop.com
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఏపీలో ఎన్నికల ముందు టీడీపీ పార్టీకి నిద్ర లేకుండా చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ఈ సినిమాని ఇప్పుడు ఏపీలో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో తనకి ఏదో పవర్ వచ్చినట్లు భావిస్తున్న ఆర్జీవి మరింత ర ఎచ్చిపోతూ వరుసగా జనసేన అభిమానులని, అలాగే టీడీపీ పార్టీ నేతలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఏపీలో రిలీజ్ చేయడానికి సిద్ధం అయిన ఆర్జీవి విజయవాడలో ప్రెస్ మీట్ మరో సంచలన విషయాన్ని చెప్పాడు.
తన తదుపరి చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ‘కమ్మ రాజ్యంలో కడప రౌడీలు’ అని తొలుత ప్రకటించిన వర్మ ఈ స్టొరీ ఐడియా తనకి విజయవాడ వచ్చిన తర్వాతే వచ్చిందని అన్నారు.
విజయవాడ రాగానే బోయపాటి సినిమాలో చూసినట్లు సుమోలు తిరుగుతున్నాయని, కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు.
ఈ నేపధ్యంలోనే తనకి ఈ ఎలిమెంట్స్ కాస్తా ఇంటరెస్టింగ్ గా అనిపించాయని అందుకే కథ రాయడం మొదలేడుతున్నానని చెప్పుకొచ్చాడు.
విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు