పవన్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తానంటోన్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల లాక్‌డౌన్‌లోనూ తన మార్క్‌ను ఏమాత్రం తగ్గకుండా ఓటీటీలో హల్‌చల్ చేస్తూ వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే శృంగార తార మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే సినిమాను రూపొందించి ఓటీటీలో రిలీజ్ చేసిన వర్మ, రీసెంట్‌గా ‘నగ్నం’ అనే సినిమాను కూడా రిలీజ్ చేశాడు.

ఇక నగ్నం చిత్రం అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఇప్పుడు మరో సినిమాను రెడీ చేసే పనిలో పడ్డాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఓ సినిమాను తెరకెక్కించేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలోనే ‘పవర్ స్టార్’ అనే సినిమాను తాను తెరకెక్కిస్తున్నానంటూ ఇటీవల చెప్పుకొచ్చాడు.

కాగా ఈ సినిమాలో పవన్ డూప్‌ను పెట్టి సినిమా తీస్తానని వర్మ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పవన్ గురించి వర్మ ఎలాంటి వివాదాలను రేపుతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమాను వచ్చే వారంలో ప్రారంభించి, ఒక్క నెలలోనే సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

ఈ సినిమాను పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు వర్మ రెడీ అవుతున్నాడు.

పవన్ జీవితాన్ని తనదైన శైలిలో ప్రేక్షకులు చూపుతానంటూ వర్మ చెప్పడంతో పవర్ స్టార్ చిత్రం ఎలా ఉంటుందా, పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారా అనే అంశాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

నేడు కేసీఆర్ బస్సు యాత్ర .. ఎక్కడ జరగబోతోందంటే ..?