జగన్ గారి ఆశీస్సులు ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తానంటున్న ఆర్జీవి హీరోయిన్ శ్రీ రాపాక..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి శ్రీ రాపాక ( Shree Rapaka )అందరికీ సుపరిచితురాలే.

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెతో "కాత్యాయని" ( Kaatyaayani )అనే సినిమా తెరకెక్కించటం జరిగింది.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో శ్రీ రాపాక ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధపడుతుంది.

వైసీపీ పార్టీ నుండి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది.సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో శ్రీ రాపాక.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో సీఎం వైఎస్ జగన్( YS Jagan ) ఆశీస్సులు ఉంటే గోపాలపురం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలుస్తానని స్పష్టం చేశారు.

"""/" / ఈ క్రమంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.రాజకీయాలలో కొత్తవారికి ప్లస్ ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు.

అదేవిధంగా రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా రెడీగా ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రతి రంగంలో ఆటుపోట్లు అనేది సహజం.

సినిమా రంగంలో కూడా ఉంటాయి.వాటిని అధికమించి రాణించాలి.

రాజకీయాల్లో కూడా తాను ఆ రకంగానే రాణిస్తానని నమ్మకం ఉన్నట్లు శ్రీ రాపాక తెలియజేయడం జరిగింది.

పార్టీ పెద్దలతో పాటు జిల్లా నాయకులతో క్యాడర్ తో అందరితో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

అంతేకాదు తన తాతల దగ్గర నుంచి తనది కాంగ్రెస్ పార్టీ అని.అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని శ్రీ రాపాక తెలియజేయడం జరిగింది.

బడ్జెట్ 6 లక్షలు.. కలెక్షన్లు 800 కోట్లు.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?