శ్రీదేవి ఒక అజ్ఞాని.. ఆమెకు లోకజ్ఞానం లేదు: ఆర్జీవీ
TeluguStop.com
ఈ ప్రపంచంలో మనుషులను తమకు నచ్చినట్లు మార్చుకునే వారెందరో ఉన్నారు.కొందరైతే బ్రెయిన్‌వాష్ చేసి ఒకరి నమ్మకాలు, వైఖరి లేదా ప్రవర్తనలను కూడా మార్చుతుంటారు.
సినిమా ఇండస్ట్రీలో సైతం ఇలాంటి వ్యక్తులు ఉండొచ్చు.ఉదాహరణకి రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) లాంటి డైరెక్టర్లు ఫ్యామిలీ లేకుండా, సింగిల్ గా బతకాలంటూ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు.
స్వార్థంగా బతకాలని, బోల్డ్ గా ఉండాలని చెబుతుంటారు.కొంతమందికి రామ్ గోపాల్ వర్మ ఒక మెంటల్ కేసు లాగా కనిపిస్తే మరి కొంతమందికి గురువు లాగా కనిపిస్తాడు.
మ్యానిప్యులేట్ చేయడంలో కూడా రామ్ గోపాల్ వర్మ దిట్ట.మ్యానిప్యులేషన్ ద్వారానే ఫస్ట్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకు ఎంతో ఇష్టమైన అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి( Actress Sridevi
) గురించి మాట్లాడాడు.
"ఆమెను బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించారా?" అని అడిగినప్పుడు "అసలు ఆమెకు లోకజ్ఞానమే లేదు.
ఇంకా ఎక్కడ బ్రెయిన్ వాష్ చేస్తాం." అంటూ మాట్లాడాడు.
"""/" /
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "శ్రీదేవి ఒక అజ్ఞాని.ఆమెకు అసలు లోకజ్ఞానమే లేదు.
నేను అయన్ రాండ్, ఫ్రెడరిక్ నీట్షే వంటి ప్రముఖ వ్యక్తుల పేర్లు చెప్తే, ఆ పేర్ల ఉచ్చరణ విని అవి ఏమైనా పురుగులేమో అని భావిస్తుంది.
ఎందుకంటే ఆమెకు సినిమానే ప్రపంచం.మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించింది.
మిగతా ప్రపంచం గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదు.ఆమె మిగతా విషయాల గురించి పెద్దగా అవగాహన పెంచుకోలేదు.
అది ఆమె తప్పు కాదు.ఆమె గురించి నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు.
బ్రెయిన్ వాష్ చేయాలంటే ఒక డిగ్రీ ఆఫ్ స్మార్ట్‌నెస్, అండర్‌స్టాడింగ్ ఉండాలి.మన ఆలోచనలు, మనం మాట్లాడేది అర్థం చేసుకోగలిగేంత బుర్ర ఉంటేనే వారిని మనం బ్రెయిన్ వాష్ చేయగలం.
శ్రీదేవికి అంత తెలివి, లోకజ్ఞానం ఉండదు.ఆమె ఆలోచనలను ఆమే అర్థం చేసుకోలేదు.
" అని చెప్పుకొచ్చాడు. """/" /
శ్రీదేవి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసింది.
ఆర్జీవీ "క్షణక్షణం (1991)" ( Ksanaksanam )అనే రోడ్డు కామెడీ హీస్ట్ ఫిలింలో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకున్నాడు.
1994లో విడుదలైన "గోవిందా గోవిందా" అనే సూపర్ నేచురల్ హీస్ట్ ఫిలింలో నాగార్జునతో కలిసి యాక్ట్ చేసింది.
ఈ సినిమా కల్ట్ స్టేటస్ సంపాదించింది.ఇందులో శ్రీదేవిని మరింత అందంగా చూపించాడు రామ్ గోపాల్ వర్మ.
ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?