కొడంగల్ పై రేవంత్ రెడ్డి ఫోకస్...మరింత పట్టుకోసమేనా?

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

అయితే కొడంగల్ నియోజకవర్గం అన్నది రేవంత్ రెడ్డి కంచుకోట అన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

అయితే ఇక సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇక కొడంగల్ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని గట్టిగా భావిస్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఓడించిన విషయం తెలిసిందే.

అయితే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నపీసీసీ చీఫ్ రేవంత్ గత మూడేళ్లుగా కోల్పోయిన పట్టును తిరిగి నిలుపుకునేందుకు తాజాగా కార్యకర్తలతో కలిసి సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్నా నా ధ్యాస మొత్తం కొడంగల్ పైనే ఉంటుందని కొడంగల్ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడారు.

అయితే ఇక రానున్న రోజుల్లో మరింతగా కొడంగల్ పై రేవంత్ రెడ్డి ఫోకస్ పెడుతున్నట్టు ప్రస్తుతం రేవంత్ కదలికలను బట్టి మనకు అర్ధమవుతోంది.

గత ఎన్నికల సమయంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ప్రత్యేకంగా కొడంగల్ పై దృష్టి సారించడంతో  టీఆర్ఎస్ పార్టీ అక్కడ పాగా వేయగలిగింది.

అయితే ఇక కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడం అనేది ఎంత ముఖ్యమో కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపొందడం కూడా అంతే ముఖ్యం.

కొడంగల్ లో రేవంత్ ఓడిపోయే పరిస్థితులు ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ దృష్టి కొంత మేర తగ్గే అవకాశం ఉంటుంది.

శిల్పాశెట్టి దంపతులకు భారీ షాక్ తగిలిందా.. అన్ని కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేశారా?