ఇక కీలక నిర్ణయాలపై రేవంత్ రెడ్డి ఫోకస్...అసలు వ్యూహం ఇదేనా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులు చాలా కఠిన తరంగా మారుతున్న పరిస్థితి ఉంది.

ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భారీ వ్యూహరచన చేయాల్సి ఉన్నా ఇంకా అంతర్గత విభేదాలు తొలగక పోవటం అంతేకాక రేవంత్ రెడ్డి తో కలిసి రావడానికి సీనియర్ లు సుముఖత చూపించకపోవటంతో రేవంత్ ఒంటరిగా తనదైన శైలిలో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అన్నది అనివార్యం.ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా అధికారాన్ని గత రెండు దఫాలుగా దక్కించుకోలేక పోయింది కావున వచ్చే ఎన్నికల్లో గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలనే బలమైన లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

"""/"/ ప్రస్తుతం రేవంత్ రెడ్డి చాలా రకాలుగా టీఆర్ఎస్ ను రకరకాల అంశాలపట్ల విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇక రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే రాను రాను ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇక అధికార టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గట్టి స్వరం వినిపించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే మరి రేవంత్ కార్యాచరణకు ఇతర సీనియర్ లు మద్దతిస్తారా అంటే కొంత ప్రశ్నార్థకమైన విషయమైనా దీనికి సమాధానం మాత్రం రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

అయితే టీఆర్ఎస్ పై భీకర స్వరం వినిపించడం ద్వారా ఎంతో కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంకు నిలకడగా ఉండటంతో పాటు కొంత టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందనేది రేవంత్ వ్యూహంలా అనిపిస్తోంది.

అయితే ఇటువంటి దూకుడు అనేది ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చాలా సాధారణమైనా అప్పటి రాజకీయ పరిస్థితులు మాత్రమే పార్టీలను గెలుపోటములు నిర్ణయించబడతాయనేది మాత్రం సుస్పష్టం.

వరల్డ్ టూర్ కోసం జాబ్ మానేసింది, ఇల్లు అమ్మేసింది.. కట్ చేస్తే..?