ఆ పని చేసి టీఆర్ఎస్ పన్నిన వ్యూహంలో చిక్కిన రేవంత్ రెడ్డి

రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతి వ్యూహాల క్రీడ అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అయితే రాజకీయ పార్టీల వ్యాఖ్యల వెనుక తెర వెనుక చాలా కసరత్తే జరుగుతుంది.

ఇక కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ, కెసీఆర్ టార్గెట్ గా, కెటీఆర్ టార్గెట్ గా తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా కెటీఆర్ కు బహిరంగ సవాల్ విసురుతూ డిబేట్ కు రావలిసిందిగా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత క్రిమినల్స్ తో డిబేట్ లు చేయనని కెటీఆర్ ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే కెటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే కెటీఆర్ ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ పై టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో గతంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇస్తుండగా పట్టుబడ్డ వీడియోలను పోస్ట్ చేస్తూ ఇటువంటి వ్యక్తి కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు అంటూ ఇటు రేవంత్ పై, కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోశారు.

"""/"/ దీంతో కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా రేవంత్ కు మద్దతుగా వ్యాఖ్యానించలేదు సరికదా రేవంత్ గత చరిత్రతో కాంగ్రెస్ పార్టీ అభాసుపాలు అవుతున్నదనే భావన తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో రేవంత్ వ్యాఖ్యలకు బదులు టీఆర్ఎస్ వ్యాఖ్యలే బలంగా వెళ్లడంతో మరోసారి టీఆర్ఎస్ ది పైచేయి అయింది.

దీంతో రేవంత్ ను రెచ్చగొట్టి తన చరిత్రనే వెలుగులోకి తెస్తూ అవే విషయాలతో రేవంత్ కు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది.

మరి రేవంత్ రెడ్డి, కెటీఆర్ ల మధ్య ఈ వార్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనేది చూడాల్సి ఉంది.

మరో పోస్ట్ తో అడ్డంగా దొరికిపోయిన శోభిత… చైతన్యతో రిలేషన్ లో ఉన్నట్టేనా?