వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ కన్నెర్ర

తెలంగాణ రాజకీయాలు మొత్తం వారి ధాన్యం కొనుగోళ్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.

ఇటు టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖరాఖండీగా తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పటికే చాలా వరకు పెద్ద ఎత్తున వరి సాగుకు రైతులు సన్నద్దమవుతున్న పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి రైతులకు చాలా ఇబ్బందికర పరిణామాలను సృష్టిస్తోంది.

అయితే తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీలపై పెద్ద ఎత్తున మండిపడ్డ విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రైతుల పక్షాన పోరాటం విషయంలో చేతులెత్తేసిందని కాంగ్రెస్ పార్టీకి రైతుల సమస్యలపై ఉన్న చిత్త శుద్ధి ఎంతో పార్లమెంట్ సాక్షిగా బయటపడిందని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే.

అయితే నేడు నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారని ప్రగల్భాలు పలుకుతున్నారని కానీ లోక్ సభలో ఎవరూ లేని సమయంలో ప్లకార్డులు పట్టుకొని ఫోటోలకు ఫోజులిస్తున్నారని, స్వయంగా కేంద్ర మంత్రి కేంద్రం కొనడానికి సిద్దంగా ఉందని ప్రకటించారని ప్రజలు చట్టసభలలో ప్రస్తావించిన అంశాలనే విశ్వసిస్తారని కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షాన పోరాడుతుందని ఆ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

"""/" / కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీనా కాదా అనేది ప్రజలకు తెలుసునని టీఆర్ఎస్ మాకు సర్టిఫికెట్ ఇవాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా ఈ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లారిటీ ఇస్తే మంచిది.

అమ్మా బాబోయ్.. రేజీనా…సాయి ధరమ్ తేజ్..రెండు నిముషాల మ్యాగి కాదు అన్నమాట