సీనియర్లకు సెగ : రేవంత్ సంచలన నిర్ణయం

ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే రాజకీయ ప్రత్యర్ధులకూ సొంత పార్టీ నేతలకు షాక్ ఇస్తూ ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.

  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణలో అధికారం సంపాదించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.

దానికనుగుణంగానే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.టిఆర్ఎస్ పార్టీని ప్రజల్లో చులకన చేసేందుకు ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో అన్నిటినీ వేస్తున్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో గుర్తింపు ఉన్నా, అధికారంలోకి రాలేక పోవడానికి కారణాలపైన రేవంత్ దృష్టిపెట్టారు.

        ముఖ్యంగా పార్టీలో గ్రూపు రాజకీయాలతో పాటు,  బలమైన నేతలు పోటీలో లేకపోవడమే టిఆర్ఎస్ విజయానికి కారణం అనేది రేవంత్ నమ్మకం .

అందుకే ఆ పరిస్థితిని మార్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంది ? అక్కడ నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే గెలుపు దక్కుతుంది అనే విషయాలపై ఇప్పటికే ఒక క్లారిటీ తో వచ్చారు.

అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోవడం తో కాంగ్రెస్ కు ఓటు వేసినా వృధానే అవుతుందనే అభిప్రాయం జనాల్లో ఉండడం తో ఆ అభిప్రాయాలను మార్చాలనే నిర్ణయానికి వచ్చారు.

      """/" / అందుకే రాష్ట్రవ్యాప్తంగా యువ నాయకులకు ప్రాధాన్యం పెంచాలని వారికి రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని వ్యూహంతో ఆయన ఉన్నారు.

చాలా కాలంగా పార్టీ సీనియర్ నాయకులు ఓటమి చెందుతూ వస్తుండడంతో , అటువంటి వారిని పక్కన పెట్టి వారి స్థానంలో యువ నాయకులకు అవకాశం కల్పించాలనే ఎత్తుగడ వేశారట.

యువ నాయకులు అయితే ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు,  ప్రత్యర్థులకు పోటీ ఇవ్వగలరని, రేవంత్ నమ్ముతున్నారు.

అందుకే వరుసగా ఓటమి చెందుతూ వస్తున్న సీనియర్ నాయకులను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చారు.

ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం వద్ద ప్రస్తావించి వారి ద్వారానే  సీనియర్లను పక్కన పెట్టే విధంగా రేవంత్ వ్యూహం రచించాడట.

ఈ విధమైన కఠిన నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయాన్ని అధిష్ఠానం పెద్దల వద్ద ఇప్పటికే ప్రస్తావించినట్టు సమాచారం.

H1B Visa Lottery : ముగిసిన హెచ్ 1 బీ వీసా లాటరీ ప్రక్రియ