రేవంత్ మొదలెట్టేశారు ! వారంతా వెనక్కి ?

ఏదో రకంగా తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చి పార్టీని అధికారం వైపు నడిపించాలనే తాపంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు.

అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఓడించేందుకు తమతో పాటు,  బీజేపీ కూడా ప్రయత్నిస్తుండటంతో తమ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును  చీల్చితే అది టిఆర్ఎస్ కె లాభం చేకూరుస్తుందనే భయం రేవంత్ లో ఉంది.

అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి టిఆర్ఎస్ ను మరింత బలహీనం చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

దీనిలో భాగంగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ టిఆర్ఎస్ లో చేరిపోవడం తో వారందరినీ వెనక్కి రప్పించాలనే ప్లాన్ లో ఉన్నారు.

వారితో పాటు టీఆర్ఎస్,  బీజేపీ పార్టీలో చేరిన నాయకులు అందరని వెనక్కు రప్పించేందుకు ఘర్ వాపసీ కార్యక్రమాన్ని రేవంత్ మొదలుపెట్టారు.

భారీ ఎత్తున నేతలు కాంగ్రెస్ లో నాయకులు చేరితే పార్టీ బాగా బలపడి అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఎప్పటి నుంచో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని రేవంత్ ప్లాన్ చేసుకున్నారు.

పాదయాత్ర కంటే ముందుగా కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లో చేరిన వారిని మళ్లీ సొంత గూటికి రప్పించే కార్యక్రమంపై ప్రస్తుతం రేవంత్ పూర్తిగా దృష్టి సారించారు.

"""/"/ ఇప్పటికే మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ను రేవంత్ కలిశారు.

కాంగ్రెస్ లో యాక్టిివ్ కావాలని ఆయనకు ఆహ్వానం పలికారు.గతంలో తెలంగాణ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండి ఇతర పార్టీలో చేరిన వారిని, రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్న నేతలను యాక్టివ్ చేసి పార్టీలోకి తీసుకురావాలి అనే ఆలోచనతో రేవంత్ ఉన్నారు.

అంతేకాదు తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి తన సత్తా చాటుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు.

అయితే అంతకంటే ముందుగానే పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండేలా,  ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని, ఎక్కువమంది చేర్చుకుని ఆ ఉత్సాహంతో తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తే అప్పుడు మంచి జోష్ వస్తుందనే నమ్మకం లో రేవంత్ ఉన్నారు.

అంతేకాకుండా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు బలమైన కేడర్ ఉన్నా,  వారిని సరైన దారిలో నడిపించే సత్తా ఉన్న నాయకులు కొరత తీవ్రంగా ఉండడంతోనే ఇప్పుడు ఘర్ వాపసీ కార్యక్రమాన్ని రేవంత్ సీరియస్ గా తీసుకున్నారట.

Holi Accident : వీడియో వైరల్: మీ ఆనందం కోసం ఇలా చేస్తే ఎలా..? చిన్న తప్పు ఎంత ప్రమాదాన్ని కలిగించిందో..!