రేవంత్ పగడ్బందీ ప్లాన్ .. గెలుపు పై ధీమా ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తెలంగాణలో కాంగ్రెస్ ను  బలోపేతం చేసేందుకు,  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎంతగానో కష్ట పడుతున్నారు.

ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకుల నుంచే పెద్దగా సహకారం అందక పోయినా , రేవంత్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.

తెలంగాణలో బీజేపీ,  టిఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను తీర్చిదిద్దడం తోపాటు, ఆ రెండు పార్టీల కంటే బలమైన పార్టీగా కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే రేవంత్ ఆలోచనలకు సీనియర్ నాయకుల నుంచి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.ఒకపక్క అధికార పార్టీ టిఆర్ఎస్ ఎదుర్కొంటూనే సొంత పార్టీలో నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రేవంత్ ప్రకటించారు.

కొడంగల్ లో రెండుసార్లు గెలిచిన రేవంత్ 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు.

రేవంత్ ను ఓడించేందుకు టిఆర్ఎస్ పకడ్బందీ చర్యలు తీసుకోవడం , కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నాయకుల కారణంగా రేవంత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

అంతేకాదు టిఆర్ఎస్ నుంచి ఆర్దికంగా బలవంతుడైన పట్నం నరేందర్ పోటీకి దింపి భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం ఇవన్నీ ఓటమికి కారణమయ్యాయి.

అయితే ప్రస్తుతం పట్నం మహేందర్ పనితీరుపై నియోజకవర్గ ప్రజల్లో అంత సాను కూలత లేదని, ఆయన అనుచరులు ఆగడాలపై స్థానికంగా వ్యతిరేకత పెరిగిందని, ఇవన్నీ తనకు కలిసొస్తాయని రేవంత్ భావిస్తున్నారు.

అంతే కాదు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ్యత్వం పైన రేవంత్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.

దాదాపు 75 వేల కాంగ్రెస్ సభ్యత్వలు నమోదు చేయించారు.రాబోయే ఎన్నికల్లో తన గెలుపుకు ఎటువంటి డోకా లేకుండా ముందస్తు జాగ్రత్తలు రేవంత్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పనిచేస్తా..: కిషన్ రెడ్డి