దొంగతనానికి వెళ్తే ప్లాన్ రివర్స్.. బిల్డింగ్ నుంచి దూకేశాడు

మనకు తెలిసిన 64 కళల్లో చోర కళ కూడా ఒకటి.కొందరి హస్తలాఘవం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది.

కళ్లు మూసి తెరిచేంత లోపు లోనే మన జేబులో డబ్బులు మాయం చేసేస్తారు.

కాసేపు ఇంటిని బయటకు వెళ్తే దాంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తారు.అయితే కొన్ని సందర్భాల్లో దొంగలు పట్టుబడినప్పుడు నవ్వు రప్పించే సన్నివేశాలు జరుగుతాయి.

వాటిని విన్నప్పుడు లేదా చూసినప్పుడు ఏ మాత్రం నవ్వాగదు.ఇలాగే ఓ ఇంట్లో దొంగతనానికి గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి వెళ్లాడు.

అదే సమయానికి ఇంట్లో పడుకున్న మహిళ లేవడంతో ప్లాన్ రివర్స్ అయింది.చివరికి మేడపైకి వెళ్లిన అతడు చేసిన హైడ్రామా పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌ నగరం మల్హర్‌గంజ్ ప్రాంతంలో బుధవారం ఓ మహిళ ఇంట్లోకి దొంగ దూరాడు.

అనుకోకుండా నిద్ర నుంచి మెలకువ రావడంతో ఆ ఇంట్లోని మహిళ సదరు దొంగను చూసింది.

దీంతో దొంగ దొంగ అంటూ గట్టిగా అరిచింది.ఆమె అరుపులతో ఆ దొంగలో భయం మొదలైంది.

ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంటి పై భాగానికి వెళ్లిపోయాడు.దీంతో అతడు కిందికి రాకుండా చుట్టుపక్కల వాళ్లు నిఘా పెట్టారు.

ఈ లోపు ఆ మహిళ వెంటనే తన ఫోన్ తీసుకుని, పోలీసులకు విషయం చేరవేసింది.

పోలీసులు అక్కడికి హుటాహుటిన వచ్చారు.అతడిని పట్టుకునేందుకు యత్నించగా, ఆ మూడు అంతస్తుల భవనం నుంచి దూకేస్తానని దొంగ బెదిరించాడు.

దీంతో అతడు కిందికి దూకితే ప్రాణనష్టం ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.దుప్పట్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు.

పైకి వెళ్లి పట్టుకునే లోపు ఆ దొంగ కిందికి దూకేశాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుప్పట్లో పడేలా ఏర్పాట్లు చేశారు.

చివరికి ఆ దొంగ పట్టుబడ్డాడు.అయితే ఈ వ్యవహారం అంతా స్థానికులు కొందరు వీడియో తీశారు.

దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది.పోలీసులను ఆ దొంగ ముప్పతిప్పలు పెట్టి, చివరికి దొరికిన తీరు నవ్వులు పూయిస్తోంది.

యూరప్ లో జంటగా కనిపించిన  నాగచైతన్య శోభిత.. రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్టేనా?