రివర్స్ బటన్ : వైసిపి పరిస్థితి ఇలా అయ్యిందేంటి ? 

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజవుగా కొనసాగుతోంది.రౌండ్ల వారిగా విడుదలవుతున్న ఫలితాలలో టిడిపి కూటమి ఆదిక్యంలో ఉన్నట్లుగా అర్థమవుతుంది.

ఏపీ మంత్రులుగా ఉన్న వారంతా ప్రస్తుతానికి వెనకంజులోని ఉన్నారు ఓటమి దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.

  రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలను చూస్తే ఇది అర్థమవుతుంది .వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ టిడిపి అభ్యర్థులు ముందంజలో ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దీంతో ఏ స్థాయిలో వైసిపి ప్రభుత్వంపై  వ్యతిరేకత పెరిగింది అనేది రౌండ్ల వారిగా వెలువడుతున్న ఫలితాలు నిరూపిస్తున్నాయి.

గతంలో ఎప్పుడు లేని విధంగా,  ఏ ప్రభుత్వం అమలు చేయని స్థాయిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని,  నేరుగా ప్రజలకే సొమ్ములు అందే విధంగా బటన్ నొక్కామని ,  ఎన్నికల్లో వైసిపి ( YCP )కి అనుకూలంగానే జనాలు బటన్ నొక్కుతారని జగన్ అంచనా వేశారు.

అయితే జనాలు మాత్రం టిడిపి కూటమి పార్టీలకే మద్దతుగా బటన్ నొక్కినట్లుగా అర్థం అవుతోంది.

"""/" /  పూర్తి ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని గంటల సమయం ఉంది.అయితే ఇప్పుడు రౌండ్ల వారీగా వెలువడుతున్న ఫలితాలు చూస్తే ఖచ్చితంగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలు వెలువడతున్నాయి.

పెద్ద ఎత్తున అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను కాపాడుతాయని,  భారీ మెజారిటీతో వైసిపి అభ్యర్థులు విజయం సాధిస్తారని జగన్ వేసిన అంచనా తలకిందులు అవ్వబోతున్నట్లుగానే పరిస్థితి ఉంది 20 ఏళ్లుగా టిడిపి( TDP ) గెలవని నియోజకవర్గం ఇప్పుడు ఆ పార్టీకి ఆదిత్యం వస్తుండడం చర్చనీయాంశంగా మారింది .

"""/" /  సంతనూతలపాడు ,మాచర్ల , పూతలపట్టు,  సత్యవేడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గలలో కూటమి హవా కొనసాగుతూ ఉండడం , రాజంపేటలో బిజెపి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ( Kiran Kumar Reddy )లీడ్ లో ఉండడం,  జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో చాలా చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉండడం,  అలాగే బిజెపి మూడు చోట్ల ఆదిత్యంలో ఉండడం వంటివి వైసిపి కి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.

మహిళలు , పురుషులు , ఉద్యోగులు ఇలా అంతా వైసిపికి వ్యతిరేకంగానే ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్లుగా ఎన్నికల కౌంటింగ్ లో రౌండ్ల వారీగా వెలువడుతున్న ఫలితాలు నిరూపిస్తున్నాయి.

ఏది ఏమైనా వైసిపి అంచనాలు తారుమారు అయ్యేలాగే పరిస్థితి కనిపిస్తుంది.

కాబోయే బ్రైడ్స్ కి బెస్ట్ స్కిన్ గ్లోయింగ్ రెమెడీస్ ఇవి..!