Revathi Bhoothakaalam Movie : రేవతి నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. ఆ దెయ్యాల సినిమాలో నట విశ్వరూపం..

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దెయ్యాల, భూతాల కథలు చెబుతూనే మానసిక సమస్యలను కూడా హైలెట్ చేసే దర్శకులు చాలామంది ఉన్నారు.

రచయితలు కూడా ఒక మనిషి వింతగా ప్రవర్తించడానికి కారణం దెయ్యాలో లేదంటే భూతాలో కాదు అవి మానసిక సమస్యలు అని చెప్పారు.

ఇక ఇలాంటి కథలకు క్లైమాక్స్ రాయడం అంత సులభమైన పని కాదు.దిగ్గజ రచయిత యండమూరి కూడా ఒక నవల క్లైమాక్స్ రాయలేకపోతే కథకు కామా పెట్టేసి ముగించేయడమే మంచిది అని అన్నాడు.

అలాగే తన "తులసి", "తులసిదళం" నవలల్లో హిప్నాటిజం లాంటివి చూపించినా వైద్య చికిత్సలను కూడా అదే స్థాయిలో వివరిస్తూ వెళ్ళాడు.

ఇక "చంద్రముఖి"( Chandramukhi ) సినిమాలో జ్యోతిక పాత్రలో ఒక నర్తకి ఆత్మ ప్రవేశించిందని అనుకుంటారు కానీ నిజానికి అది ఒక మానసిక సమస్య.

"""/" / ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.రీసెంట్‌గా "భూతకాలం" సినిమా ( Bhoothakaalam Movie ) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ సినిమా చూస్తుంటే ఎవరికైనా సరే పిచ్చిగా ప్రవర్తించే వారికి మానసిక సమస్యలు ఉన్నాయనే అభిప్రాయం ఏర్పడుతుంది.

ఈ సినిమా దర్శకుడు రాహుల్ సదాశివన్,( Rahul Sadasivan ) ఇతను "భ్రమయుగం"( Bramayugam ) తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

భూతకాలం సినిమాలో రేవతి,( Revathi ) షేన్ నిగమ్( Shane Nigam ) నటించారు.

2022లో వచ్చిన ఈ సినిమా సూపర్ నేచురల్ హారర్ అయినా చాలా మానసిక సమస్యలను, భయాలను చూపిస్తుంది.

కథలో దెయ్యాలు, ఆత్మలు ఉన్నా కథ మానసిక సమస్యల చుట్టూ తిరుగుతుంది. """/" / భూతకాలం సినిమా కథ క్లుప్తంగా చెప్పుకుంటే ఇందులో ప్రధాన పాత్ర అయిన ఆశ (రేవతి) ఒక స్కూల్ టీచర్, విను (షేన్ నిగమ్) ఆశ కొడుకు, డాక్టర్ కావాలని ఆశిస్తాడు.

అమ్మమ్మ: ఆశ అత్త.ఆశ భర్త చనిపోయి, అమ్మమ్మ, కొడుకు వినుతో కలిసి ఉంటుంది.

డాక్టర్ కావాలని కలలు కన్న విను, తల్లి ఒత్తిడితో ఫార్మసీ చదువుతాడు.రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నా ఫలితం లేదు.

విసుగుచెందిన విను, వేరే ఊరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. """/" / అదే సమయంలో అమ్మమ్మ చనిపోతుంది.

అప్పటినుంచి ఆ ఇంట్లో ఏదో దెయ్యం, భూతం లాంటిది తిరుగుతుందని విను గమనిస్తాడు.

మొదట అది మానసిక రుగ్మత అని భావించిన ఆశ, వినుకు కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది.

కానీ ఎలాంటి ఫలితం కనిపించదు.ఈ క్రమంలో తల్లి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది.

చివరికి అమ్మమ్మ మరణం వెనుక కూడా కుట్ర ఉందని అనుమానించుకుంటారు.ఇక ఆ తర్వాత ఎలా మలుపులు తిరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

హారర్ సినిమాల్లో( Horror Movies ) దెయ్యాలను భయంకరంగా చూపించడం సాధారణం.కానీ ఈ సినిమాలో దెయ్యాలు, వింత వేషాలు లేవు.

భయం కలిగించడానికి శబ్దాలు, దృశ్యాలను మాత్రమే ఉపయోగించాడు దర్శకుడు.భ్రమయుగం సినిమా లాగానే ఈ సినిమాలో కూడా ఒక చిన్న ఇల్లు కథకు కేంద్రం.

సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంది.ఈ సినిమాను పెద్ద హాల్లో హైఎండ్ స్పీకర్లతో చూస్తే నెక్స్ట్ లెవెల్ థ్రిల్ అనుభవించవచ్చు.

రేవతి, షేన్ నిగమ్ నటన చాలా బాగుందని, ముఖ్యంగా క్లైమాక్స్ లో రేవతి నట విశ్వరూపం చూపించిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.