కుటుంబ పోషణ కోసం మెకానిక్ అవతారమెత్తిన అమ్మాయి..

ప్రతి విషయంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా రాణిస్తున్నారు.ఏ విషయంలోనూ ఆడవారు తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే మగవాళ్ల కంటే మహిళలదే పైచేయి అవుతుంది.ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి కూడా ఈ విషయాన్నీ నిరూపించింది.

ఒక అమ్మాయి తన కుటుంబానికి అండగా ఉండడం కోసం మెకానిక్ గా పనిచేస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.విశాఖపట్టణానికి చెందిన రేవతి అనే అమ్మాయి డిగ్రీ పూర్తి చేసుకుంది.

అంత చదువుకున్న అని ఏమాత్రం గర్వపడకుండా తన తండ్రితో పాటు మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటుంది.

జనం ఏమనుకుంటారో అని భయపడకుండా మెకానిక్ వృత్తిని ఎంచుకుని అందరితో శభాష్ అనిపించుకుంటుంది.

రేవతి తండ్రి కూడా ఒక మెకానిక్.రేవతి తండ్రి రాము దాదాపు 22 సంవత్సరాలుగా మెకానిక్ గా పనిచేస్తున్నాడు.

కానీ ఈ మధ్య కేవలం పంచర్లు మాత్రమే వేయడంతో వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు.

ఒక పనివాడిని పెట్టుకుందామన్న స్తోమత లేకుండా పోయింది.దీంతో రాము చిన్న కూతురు అతడికి సహాయంగా ఉండేది.

8 వ తరగతిలోనే పంచర్లు వేయడం నేర్చుకుంది రేవతి. """/"/ మొదట్లో రేవతి పనిని ఎవరు నమ్మేవారు కాదు.

కానీ మెల్లమెల్లగా తన పని చూసి అందరు తన దగ్గరకే రావడం మొదలుపెట్టారు.

తన తండ్రికి ఆర్థికంగా సహాయం చేయడం కోసం రేవతి కష్టమైన పనిని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ అందరికి ఆదర్శంగా నిలవడమే కాకుండా శబాష్ అని కూడా అనిపించుకుంటుంది.

అంతేకాదు ఎవరైనా ఫోన్ చేసిన ఎక్కడున్నా వెళ్లి పంచర్ వేసి రావడం తన ప్రత్యేకత అని స్థానికులు చెబుతున్నారు.

రేవతికి ఒక అక్క కూడా ఉంది.ఆమెకు పెళ్లి అయ్యింది.

తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే డిగ్రీ పూర్తి చేసింది.ఇంకా తన తండ్రికి కొడుకైనా.

కూతురైన తనే అని అనుకుని తండ్రికి ఆర్థికంగా సహాయంగా ఉండాలని నిర్ణయించుకుంది.తనకు పంచర్లతో పాటు వాహనాలకు సంబంధించి మిగతా పనులపై కూడా మంచి పట్టు ఉందట.

అందుకే రేవతి మెకానికల్ ఫీల్డ్ లోనే ఏదైనా చేయాలనీ అనుకుంటుంది.

రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు..: హరీశ్ రావు