కేటీఆర్ హరీష్ మధ్య ‘ మంట ‘ రాజేస్తున్న రేవంత్
TeluguStop.com
బీఆర్ఎస్ ( BRS )లో కీలకంగా ఉన్న మాజీ మంత్రి,, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( President KTR ), ఆ పార్టీలోని మరో కీలక నేత హరీష్ రావు మధ్య గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం జరుగుతుంది.
దీనికి తగ్గట్లుగానే కాంగ్రెస్ కూడా వీరిద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా వ్యవహరిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.బీఆర్ఎస్ లో కేసీఆర్( Kcr ) తర్వాత అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన కేటీఆర్ కు చెక్ పెట్టే విధంగా, కేటీఆర్ ప్రభావాన్ని అటు బిఆర్ఎస్ లోనూ, జనాల్లోనూ తగ్గించేందుకు రేవంత్ ఎత్తుగడ వేసినట్లుగా కనిపిస్తోంది.
కేటీఆర్ విమర్శలకు స్పందిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా కేటీఆర్ విమర్శలను పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ, అదే సమయంలో హరీష్ రావు చేస్తున్న విమర్శలను హైలెట్ చేసే విధంగా కౌంటర్ ఇస్తున్నారు.
"""/" /
దీంతో గత కొద్ది రోజులుగా హరీష్ రావు ( Harish Rao )అన్ని విషయాల్లోనూ హైలెట్ అవుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు హరీష్ రావు పైనే విమర్శలు చేస్తూ, ఆయన చేసే ప్రతి విమర్శను తిప్పుకొడుతూ వస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ను పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ హరీష్ రావు పైనే విమర్శలు చేయడం, ఆయనకే సవాళ్లు విస్తడం వెనుక రేవంత్ రెడ్డి ఉద్దేశం వేరే ఉందని బిఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి .
అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను మేనేజ్మెంట్ కోట కింద లెక్క గట్టి విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కేటీఆర్ విమర్శలకు, సోషల్ మీడియాలో ఆయన కౌంటర్లకు స్పందించడం లేదు.
కెసిఆర్ తర్వాత కేటీఆర్ అనే భావన కేడర్ లో ఉన్నా గత కొన్ని రోజులుగా హరీష్ రావు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి.
ఈ ఇద్దరిలో ఫ్యూచర్ లీడర్ ఎవరు అనే చర్చ ఆ పార్టీలో మొదలైంది.
"""/" /
గత కొద్ది రోజులుగా హరీష్ రావు పై రేవంత్ రెడ్డి ( Revanth Reddy )విమర్శలు చేస్తున్నారు.
మంత్రులు సైతం హరీష్ రావునే టార్గెట్ చేసుకున్నారు.అగ్గిపెట్ట హరీష్ రావు అంటూ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీష్ రావు ను టార్గెట్ చేసుకున్నారు.
కేటీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది ఆయనకు రాజకీయంగా మంచి మైలేజ్ ఇస్తూనే ఉద్దేశంతోనే హరీష్ రావును హైలైట్ చేసేందుకు వీరిద్దరి మధ్య వైరం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనే అనుమానాలు మొదలయ్యాయి.
ఇప్పటికే హరీష్ , కేటీఆర్ మధ్య కొద్దికొద్దిగా ఆధిపత్య పోరు మొదలైందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే, కాంగ్రెస్ దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది.
ఫస్ట్ టైమ్ గులాబ్ జామూన్ రుచిచూసిన కొరియన్ అమ్మాయి.. ఆమె రియాక్షన్ వైరల్..