బీజేపీ వీక్ అయ్యింది అని చెప్పేందుకు రేవంత్ తంటాలు

పక్క పార్టీ బలహీన పడిందని ,ఆ పార్టీలో చేరినా ఎటువంటి ప్రయోజనం ఉండదని చెప్పేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) చాలానే తంటాలు పడుతున్నారు.

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ లో ఇమడలేక, తీవ్ర అసంతృప్తితో ఉంటున్న వారు , వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదు అనుకున్నా వారు,  ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేతలు ఎంతోమంది పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ లోకి వెళ్లాలా బిజెపిలో చేరాలా అనే విషయంలో గందరగోళానికి గురవుతున్నారు.

  అటువంటి నేతలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ( Congress )వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఈ మేరకు పార్టీ తరఫున తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సర్వే రిపోర్ట్ ను విడుదల చేశారు.

"""/" / ఈ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది క్లారిటీ ఇచ్చారు.

గతంలో కాంగ్రెస్ కు 70 సీట్లు ఖాయం అంటూ చేసిన ప్రకటనలను పక్కనపెట్టి తాజా సర్వేలో కాంగ్రెస్ కు 45 సీట్లు,  బీఆర్ఎస్( BRS ) కు 40 సీట్లు, బిజెపికి ఏడు సీట్లు వస్తాయని రిపోర్టును విడుదల చేశారు.

గత ఎన్నికల్లో ఒక్కచోట గెలిచి 11 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బిజెపి ఇప్పుడు ఏడు సీట్లు గెలుచుపోతున్నట్లు సర్వేలో తేలింది.

తాజా సర్వే లో వెల్లడైన ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం వెళ్లడైనా సర్వే ఫలితాలను విశ్లేషిస్తే అసలు వచ్చే ఎన్నికల్లో బిజెపి పోటీలో ఉండదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఈ సర్వే రిపోర్ట్ ను వెల్లడించినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా ఇటీవల పార్టీ మారే ఆలోచనలో ఉన్న కీలక నేత్రలను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు, తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందనే సంకేతాలను ఈ విధంగా తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతుంది.

"""/" / ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలో చేరికలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు.

ఎంత భారీ స్థాయిలో చేరికలు ఉంటే అంతగా తన ప్రాధాన్యం అధిష్టానం పెద్దల వద్ద పెరుగుతుందని, అలాగే వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఎటువంటి డోఖా ఉండదు అనే అభిప్రాయంతో రేవంత్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

కమెడియన్ లతో ఆడి పాడిన హీరోయిన్స్ వీరే !