ఆ మీడియా పై రేవంత్ సీరియస్ యాక్షన్ ? 

ఆ మీడియా పై రేవంత్ సీరియస్ యాక్షన్ ? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కొన్ని కొన్ని విషయాల్లో కఠిన వైఖరిని అవలంబించాలని నిర్ణయించుకున్నారు.

ఆ మీడియా పై రేవంత్ సీరియస్ యాక్షన్ ? 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేయడమే ధ్యేయంగా కొంతమంది సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్( Social Media, YouTube Channel ) ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేయడం,  వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని ప్రజలకు అందించడం వంటి వాటి కారణంగా తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా అప్రతిష్ట పాలవుతోందని,  దీనికి అడ్డుకట్ట వేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు .

ఆ మీడియా పై రేవంత్ సీరియస్ యాక్షన్ ? 

"""/" / ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు కథనాలను అడ్డుకునేందుకు ఏం చేయాలనే దానిపైన న్యాయం నిపుణులతో చర్చించినట్లు సమాచారం .

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు,  వివిధ శాఖలలో జరుగుతున్న కార్యక్రమాలపై విపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లో ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ , ప్రజలలో ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచే విధంగా చేస్తున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు అందించాయి.

"""/" / కనీసం ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం పై విమర్శ చేయడమే ధ్యేయంగా వీరంతా పనిచేస్తున్నారని ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

దీంతో తప్పుడు కథనాలను కట్టడి చేసేందుకు ఏం చేయాలనే దానిపైన న్యాయ నిపుణులతో రేవంత్ రెడ్డి చర్చించారట.

  కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు,  యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న దుష్ప్రచారం ను తిప్పుకొట్టడంతో పాటు, మితిమీరి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేసే దిశగా రేవంత్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేసే విధంగా త్వరలోనే విధి విధానాలు రూపొందించబోతున్నట్టు సమాచారం.

ఈ మేరకు కొంతమంది కీలక అధికారులకు రేవంత్ బాధ్యతలు అప్పగించారట.

ఓడపై 100 మందిని మట్టి కరిపించే ఫైట్.. వార్2 సినిమాకు ఈ ఫైట్ హైలెట్ కానుందా?

ఓడపై 100 మందిని మట్టి కరిపించే ఫైట్.. వార్2 సినిమాకు ఈ ఫైట్ హైలెట్ కానుందా?