నేను అందుకే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచా.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బాస్ సీజన్6 విజేతగా రేవంత్ ను ప్రకటించడంతో అతని ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.

105 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ అనుభవించిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని నెటిజన్ల నుంచి సైతం కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే తాను బిగ్ బాస్ సీజన్6 విన్నర్ గా నిలవడం గురించి తాజాగా రేవంత్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో నేను నాలానే ఉన్నానని అందుకే నేను బిగ్ బాస్ షో విజేతగా నిలిచానని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏం జరిగింది ఎలా జరిగిందనేది తనకు మ్యాటర్ కాదని ప్రస్తుతం బిగ్ బాస్ విజేత అనే టైటిల్ నా చేతిలో ఉందని టైటిల్ ఉందంటే డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో నా క్యారెక్టర్ ను మార్చుకోలేదని రేవంత్ తెలిపారు.

నాకు కోపం వస్తే కోపం చూపించానని ప్రేమ వస్తే ప్రేమ చూపించానని ఏ సమయంలో ఎలా ఉండాలో నేను అలానే ఉన్నానని రేవంత్ పేర్కొన్నారు.

ప్రేక్షకుల కోసం నేను ఇలా ఉండాలని అనుకుంటూ ఎప్పుడూ నన్ను నేను మార్చుకోలేదని అందుకే నేను బిగ్ బాస్ షోకు విజేతగా నిలిచానని రేవంత్ చెప్పుకొచ్చారు.

నా వాళ్లు అనుకున్న వ్యక్తులు సైతం నన్ను మాటలు అన్న సమయంలో బాధ కలిగిందని రేవంత్ అభిప్రాయపడ్డారు.

"""/"/ నా నెగిటివ్ ను ఎప్పుడైతే పాజిటివ్ గా మలచుకున్నానో అప్పుడే నేను విజేతగా నిలిచానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రేవంత్ చెప్పిన విషయాలు నూటికి నూరు శాతం కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్6 విన్నర్ గా నిలవడంతో రేవంత్ గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది.