ఉత్తమ్ కుమార్ రెడ్డి పై రేవంత్ రెడ్డి ఆగ్రహం..!!
TeluguStop.com
టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి విషయంలోకి వెళ్తే ఈ ఇరువురు బడా నేతలు.ఒకే కుటుంబంలో రెండు టికెట్ల విషయంలో వాగ్వాదం జరిగిందట.
అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో పార్టీలో రెండు టికెట్ల విషయం గురించి ఉత్తం మరియు రేవంత్ ఇరువురు నువ్వా నేనా అన్నట్టుగా వాగ్వాదం చేసుకున్నారట.
దీంతో ఓకే కుటుంబానికి రెండు టికెట్లు అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని.రేవంత్ తెలపగా.
పీసీసీ చీఫ్ గా హై కమాండ్ కి చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) సూచించారు.
ఇలాంటివి తనకు చెప్పొద్దని రేవంత్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.సమావేశం అనంతరం ఇరువురి మధ్య వాదన జరగటంతో ఆగ్రహంతో ఎవరికి వారు వెళ్ళిపోయారు అంట.
తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది.
దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించాలని పార్టీ నేతలు మంచి పట్టుదల మీద ఉన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి చెందిన జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూనే ఉన్నారు.
అంతా బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలలో సమన్వయం లేకపోవడంతో పాటు నేతల మధ్య గొడవలు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.
హను రాఘవపూడి ఫౌజీ సినిమా ను ఫాస్ట్ గా చేస్తున్నాడా..?