బీజేపీలోకి వెళ్ళే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి:కేటీఆర్
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ఓటమిపై బాధపడొద్దు,రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేద్దాం,మేము ఇచ్చిన ఉద్యోగాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ పత్రాలు ఇచ్చి గొప్పలకు పోతుండు,ఉద్యోగాలు ఇచ్చి కూడా మనం ప్రచారం చేసుకోలేకపోయాం,నిరుద్యోగులను,ఉద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ లాభం పొందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ కేసీఆర్ ఉన్నన్నిన్నాళ్ళు అన్నదాతలకు స్వర్ణయుగమైందని,నల్గొండలో చివరి భూములకు కూడా నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ దని,ఇకనైనా మనం చేసిన పనులను ప్రజలకు చెప్పుకుందామన్నారు.
ఉమ్మడి నల్గొండలో 3 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినా కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలకు ప్రజలు బోల్తా పడ్డారని,కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని,మళ్ళీ ఊల్లల్లో బోరుబండ్ల మోతలు వినబడుతున్నాయని,రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని,ఇవ్వాళ బ్యాంక్ లు అన్నదాతలను పిడిస్తున్నాయని,రైతు బంధు ఇవ్వకుండా మోసం చేశారని, కోమటిరెడ్డి అన్నదాతలను చెప్పుతో కొడతాం అంటాడు,ఉత్తమ్ మేమో రైతు బంధు దుబారా అంటున్నాడు,ఇప్పుడు అన్నదాతలు కాంగ్రెస్ వాళ్ళను చెప్పుతో కొట్టాలి,ఎంపీ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పి నల్గొండ ఎంపి సీటు గెలుస్తామన్నారు.
రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్న అంటున్నాడు,నువ్వేమైన జేబు దొంగవా అని అడుగుతున్నా,రేవంత్ కు నల్గొండ,ఖమ్మం కాంగ్రెస్ నేతలతోనే డేంజర్ ఉన్నదని,నాయనా అది ముందు చూసుకో,నీ పార్టీలోనే ఎక్ నాథ్ షిండేలు వున్నారు జాగ్రత్తగా ఉండని సలహా ఇచ్చారు.
పొంకణాల రెడ్డి రేవంత్ రెడ్డి 420 హామీలు నెరవేర్చే దాకా నిన్ను వదలమని,అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.
పార్లమెంటు ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని,కేసులు తప్పించుకునెందుకు బీజేపీలో చేరుతాడని కామెంట్ చేశారు.
అనంతరం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి కనీస సోయి లేదని, అన్నదాతలు చస్తున్నా పట్టింపు లేదని,అక్రమ కేసులు పెట్టుడే కాంగ్రెస్ అలవాటు అయిందని,కేసులతో మమ్ములను భయపెట్టాలని చూస్తున్నారని,కాంగ్రెస్ దొంగలు ఫోన్ ట్యాపింగ్ అంటూ నానా యాగీ చేస్తున్నారని,ఒక్కటి కూడా నిజం కాదని,బధనామ్ చేసుడే కాంగ్రెస్ నైజమని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని, కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడ తిరగనియ్యమని,
ఎక్కడికక్కడ నిలదిస్తామన్నారు.ఇక కేసీఆర్ ప్రతాపం చూస్తారని,కేసీఆర్ అంటేనే భరోసా,ధైర్యం,కేసీఆర్ భరోసా ఇవ్వగానే అన్నదాతలు చాలా ధైర్యంగా వున్నారన్నారు.
పోరాటం చేద్దామని, పనికిరాని చెత్త ఇప్పుడు పార్టీ నుండి బయటకు పోతుందని,ఎవ్వరు పార్టీ మారినా ఏం నష్టం లేదన్నారు.
కాంగ్రెసు వాళ్లకు సాగర్ డ్యామ్ పైకి పొయే దమ్ములేదని,సాగు నీళ్లు ఇవ్వంటే తప్పించుకు తిరుగుతున్నరని,కాంగ్రెస్ నాయకులకు చెప్పులతో సమాధానం చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి,ఎమ్మెల్సీ కోటిరెడ్డి,జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?