అదే జరిగితే బీజేపీలోకి రేవంత్ ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బాహుబలి గా ఉంటూ, ఆ పార్టీని ఏదోరకంగా అధికారం వైపు నడిపించాలని చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా, ఏ సమస్యల పైన పోరాటం చేయాలన్నా, రేవంత్ ముందుంటున్నారు.

అలాగే నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తూ, కెసిఆర్ కేటీఆర్ కు ఇబ్బందులు సృష్టిస్తూ రేవంత్ హడావుడి చేస్తూ వస్తున్నారు.

ఇక ఈ వ్యవహారాల్లో పార్టీ సీనియర్ నాయకుల నుంచి పెద్దగా సహకారం లేకపోగా, తనని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నా, రేవంత్ మాత్రం లెక్కచేయకుండా పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు.

ప్రస్తుతం దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలకు సంబంధించి కానీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కానీ, రేవంత్ గట్టిగానే టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ఈ రెండు చోట్ల కాంగ్రెస్ జెండా ఎగర వేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఆయనను ఎట్టి పరిస్థితుల్లో అయినా బీజేపీ లో చేర్చుకోవాలి అని, ఆ పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

గత కొంతకాలంగా రేవంత్ బీజేపీలో చేరతారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.ఆయన కనుక చేరితే పార్టీలో కీలక పదవి అప్పగించేందుకు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకునే అవకాశాలు లేకపోవడం తో,  పార్టీ మారితే కలిసొచ్చే అంశాలు ఏంటి ?అలాగే ప్రతికూల అంశాలు ఏంటి అనేది లెక్కలు వేసుకునేే పనిలో ఉన్నారట.

తెలంగాణలో హోరాహోరీగా జరగబోతున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించకపోతే, రేవంత్ కాంగ్రెస్ ను వీడక  తప్పదు అనే ప్రచారం జరుగుతోంది.

అలాగే త్వరలోనే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యి, బీజేపీలోకి  వెళ్లే అంశంపై చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ అదే జరిగితే తెలంగాణ లో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం మాత్రం తప్పదు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

చిరు నాగ్ వెంకీలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?