ఆ మాజీ ఐఎఎస్ ను రేవంత్ వదిలిపెట్టేలా లేరే ?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారు అంటే ఆషామాషీగా వదిలిపెట్టారు.

వారి పుట్టు పూర్వోత్తరాలు అన్ని ప్రస్తావించి మరీ ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపైనా ఘాటు విమర్శలతో విరుచుకుపడుతూ ఉంటారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రేవంత్ దూకుడు మరింత ఎక్కువ అయ్యింది.

రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అని నమ్మకం ఆ పార్టీ అధిష్టానం పెద్దలలోను కలిగింది.

  హుజురాబాద్ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందడంతో నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారు .

తాజాగా మళ్లీ యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తున్నారు.ఇటీవల తన పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ గా ఎంపికైన వెంకటరామ్ రెడ్డిని ఇప్పుడు రేవంత్ టార్గెట్ చేసుకున్నారు.

త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో వెంకటరామిరెడ్డి ఆర్థికశాఖ మంత్రిగా అవకాశం కల్పించబోతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో,  వెంకటరామిరెడ్డి అవినీతిపరుడని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని , ఆయనపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయనే విషయాన్ని రేవంత్ ఇప్పుడు తెర మీదకు తీసుకు వస్తున్నారు.

గ్రూప్ వన్ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగం మొదలుపెట్టిన వెంకట్రామిరెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, రాజకీయ నాయకులు అందరికీ సన్నిహితంగా మెలుగుతూ రావడం వల్లే ఆయన ఐఏఎస్ సాధించారని , ఇప్పుడు కేసీఆర్ దగ్గర కూడా అదే విధంగా వ్యవహరించి ఎక్కువ ప్రాధాన్యం పొందారని రేవంత్ విమర్శలు చేస్తున్నారు.

"""/"/ అలాగే హైదరాబాద్ శివార్లలో ఇటీవల ప్రభుత్వం వేలం నిర్వహించిన కోకాపేట భూముల విషయంలోనూ,  ఇదే విధమైన ఆరోపణలను ఎదుర్కున్నారు.

ఇక వెంకట్రామిరెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసిన 24 గంటల్లోపే ఆయనను ఎమ్మెల్సీ గా ఏ ఈ విధంగా ఎందుకు చేశారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.

  అసలు ఈ విధంగా చేసేందుకు డీవోపీటీ నుంచి అనుమతి తీసుకున్నారా అని రేవంత్ ప్రశ్నించారు.

వెంకటరామ్ రెడ్డి బయటకు వస్తే మరింతగా ఆయనను టాబ్లెట్ చేసుకోవచ్చని భావించినా, అఫిడవిట్ బయటకు రాలేదు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!