షర్మిల… కేసీఆర్ బాణం… రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి.షర్మిల .

కేసీఆర్ వదిలిన బాణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని, ఆయనకు అభిమానులు తెలంగాణలో ఉన్నాగాని ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ ముఖ్యమంత్రి అవటం జరిగిందని తెలిపారు.

వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిందని స్పష్టం చేశారు.

వైయస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందని పేర్కొన్నారు.అంతమాత్రాన షర్మిల పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితుల్లో ఎవరూ లేరని స్పష్టం చేశారు.

రాజన్న బిడ్డ గా ప్రజలు అభిమానిస్తారు ఏమోగానీ పార్టీ పెడితే ఆమోదించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

కుటుంబంలో ఏదైనా గొడవలు ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలి, కాని తెలంగాణ లో కాదు అంటూ షర్మిల పై సెటైర్లు వేశారు.

షర్మిల పొలిటికల్ ఎంట్రీ వెనకాల కెసిఆర్ హస్తం ఉందని ఆరోపించారు.కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండటంతో.

కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం షర్మిల అంటూ రేవంత్ స్పష్టం చేశారు.

ఈ సినీ సెలబ్రిటీల నిజమైన పేర్లు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..