తెలంగాణ ఎన్నికలలో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి చాలా రోజుల తర్వాత మరల మీడియా ముందుకి వచ్చారు.
రావడంతోనే టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకొని రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు చేసారు.
ప్రస్తుతం కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణకి రంగం సిద్దం చేసుకున్న టైంలో ఊహించని విధంగా రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రేవంత్ రెడ్డి ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హరీష్ రావుకి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా లేరని వాఖ్యలు చేసారు.
అంతటితో ఆగకుండా తోటపల్లి పనుల్లో హరీష్ రావు వెయ్యి కోట్లు వరకు వెనకేసుకున్నారని, వాటినే ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసారని వాఖ్యలు చేసారు.
అలాగే హరీష్ 30 మంది ఎమ్మెల్యే అభ్యర్ధుల కోసం ఆ డబ్బుని ఉపయోగించినట్లు రేవంత్ రెడ్డి వాఖ్యలు చేసారు.
ప్రస్తుతం హరీష్ రావు అమిత్ షా కి ఫోన్ చేసారని, ఈ విషయాలన్నీ కేసీఆర్ కి తెలిసిపోవడంతో హరీష్ రావుపై ముఖ్యమంత్రి గుర్రుగా వున్నారని సంచలన వాఖ్యలు చేసారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ వాఖ్యలు ఇప్పుడు రాజకీయ్ వర్గాలలో సంచలనంగా మారాయి.
చాలా కాలం తర్వాత మీడియా ముందుకి వచ్చిన రేవంత్ రెడ్డి ఊహించని విధంగా చేసిన ఈ వాఖ్యల వెనుక కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
మరి దీనిపై హరీష్ రావు ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.