ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా..!
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖను అందించారు.
ఇప్పటికే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ కు వెళ్లి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
వెంకీ అట్లూరి తో సినిమాకి సిద్ధం అయిన అక్కినేని హీరో…