టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇస్తున్న రేవంత్‌రెడ్డి

మేడిపండు చూసేందుకు మేలిమిగానే కనిపిస్తుంది.కానీ దాని పొట్ట విప్పితేనే గుట్టు బయటపడుతుంది.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కూడా మేడిపండు మాదిరిగానే కనిపిస్తోంది.కానీ పార్టీలో వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది.

వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేల గ్రాఫ్ గురించి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ కేసీఆర్‌కు నివేదిక సమర్పించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదని రిపోర్టులో సూచించారు.అయితే ఆయా నియోజకవర్గాల్లో రైతు బంధు, దళిత బంధు లాంటి పథకాలతో ప్రజలను ఆకట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.

కానీ పథకాల అమలులో అన్యాయం జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గులాబీ పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలను తమ వెంట నడిచేలా ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మరోవైపు తన వ్యూహాలకు రేవంత్‌రెడ్డి పదును పెడుతున్నారు.కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్ కార్పొరేటర్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని తమ పార్టీలో చేర్చుకున్న రేవంత్.

నేడో, రేపో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాగే ప్రయత్నాల్లో ఉన్నారు.

గతంలో కొల్లాపూర్‌లో వరుసగా గెలిచిన జూపల్లి కృష్ణారావును తమ పార్టీలో చేర్చుకుని తద్వారా సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డికి ఝలక్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు.

"""/"/ఇంకా పలువురు కీలక నేతలపైనా రేవంత్ కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.అటు ఇటీవల కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించి సడెన్‌గా సైలెంట్ అయిపోయారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపేందుకే జాతీయ పార్టీ నినాదాన్ని కేసీఆర్‌ ఎత్తుకున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ ఓ కాలం చెల్లిన మెడిసిన్ అని.అది ఇక పనిచేయబోదన్నారు.

అంతేకాకుండా ఆ మెడిసిన్‌ను బలవంతంగా వేసుకుంటే దుష్పరిణామాలు ఉంటాయన్నారు.ఇతర రాష్ట్రాలకు వెళ్లి కేసీఆర్ కలిసి వచ్చిన నేతలు.

ఆయన్ను ఓ జోకర్‌లా చూస్తున్నారని చురకలు అంటించారు.బీఆర్‌ఎస్‌ అంటున్న టీఆర్‌ఎస్‌కు.

ప్రజలే వీఆర్‌ఎస్‌ ఇస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు.

ఈ రాశుల వారికి.. ఈ సంవత్సరం అంతా శశ రాజయోగం..!