Revanth Reddy Missing: రేవంత్ రెడ్డి మిస్సింగ్.. మల్కాజ్ గిరిలో వెలసిన పోస్టర్లు..!!
TeluguStop.com
ప్రస్తుతం తెలంగాణ(telangana) రాష్ట్రంలో రాజకీయ రగడ కొనసాగుతోంది.ఈ తరుణంలోనే వర్షాలు మొదలవడంతో ప్రతిపక్ష నాయకులంతా వర్షాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడం లేదని అధికార పార్టీని నిలదీస్తున్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి(GHMC) ఆఫీస్ ముందు ధర్నాకు దిగింది.దీంతో అక్కడ మోహరించి ఉన్న పోలీసులు అంతా వారందరిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఇదిలా సాగుతూ ఉండగానే కాంగ్రెస్ పార్టీ (Congress Party)అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ కొన్ని పోస్టర్లు తన నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్ గిరి లో(Malkajgiri) వెలుగు చూశాయి.
ప్రస్తుతం ఈ పోస్టర్లు నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.2020 లో నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తాయి.
అప్పుడు కూడా రేవంత్ రెడ్డి సందర్శించలేదు. """/" /
అలాగే 2023 లో కూడా వరదలు ముంచెత్తి ఎంతోమంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు అయినా రేవంత్ రెడ్డి(Revanth Reddy) కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు అంటూ పోస్టర్లు నియోజకవర్గ కేంద్రంలో ప్రధానమైనటువంటి కూడళ్లలో అంటించారు.
ప్రస్తుతం ఈ పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ.
ఓ ఎంపీగా ఉన్న నువ్వు ఎప్పుడైనా నియోజకవర్గంలో పర్యటించావా.అంటూ ప్రశ్నిస్తూ వెలసిన ఈ పోస్టర్లపై ఇంకా రేవంత్ రెడ్డి స్పందించలేదు.
"""/" /
అయితే కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇదంతా బిఆర్ఎస్(BRS) నేతల ప్రమేయం అని, వారే కావాలని ఈ పోస్టర్లు అతికించారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఇంకో ఐదు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నాయకుల రగడ రోజుకో మలుపు తిరుగుతూ చర్చనీయాంశంగా మారుతుంది.
మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ముందు ముందు చూద్దాం.
రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేసిన చిరంజీవి.. సీనియర్ హీరోల్లో ఈ హీరోదే రికార్డ్!