మరో రెండు పథకాల అమలుకు రేవంత్ రెడ్డి రెడీ
TeluguStop.com
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ).
సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ , ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూనే, మరో రెండు పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు .
ఈ మేరకు దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా పథకాలను( Farmers' Insurance Schemes ) ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఈ పథకాల అమలుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, దీనికోసం ఎంతవరకు నిధులు అవసరం అవుతాయి అనే విషయం పైన అధికారులను ఆరా తీస్తున్నారు.
ఈ దసరా నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు పథకాలను అమలు చేయాలనే లక్ష్యంతో రేవంత్ ఉన్నారు.
ఇంద్రమ్మ ఇళ్లకు ఐదు లక్షల హార్దిక సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
"""/" /
ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4.
50 లక్షల ఇళ్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ప్రజా పాలన దరఖాస్థుల్లో భాగంగా ప్రభుత్వానికి 55 లక్షల దరఖాస్తులు రాగా , వాటి పరిశీలనకు రేవంత్ రెడ్డి నుంచి అనుమతి రాగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు .
సొంత ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు, ఐదు లక్షలు, ఎస్సీ ఎస్టీలకు ( SC , STs )ఆరు లక్షల చొప్పున సాయం చేయనున్నారు.
రైతు భరోసా కింద ఎకరానికి 7500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో కేవలం సాగు భూములకు మాత్రమే రైతు భరోసా కింద సాయం చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది .
"""/" /
గత ప్రభుత్వం గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది .
దీంతో రైతులు వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సాగు భూములకు మాత్రమే రైతు భరోసా సాయం అందించాలని నిర్ణయించుకుంది.
అలాగే భూ స్వాములకు కాకుండా, పేద రైతులకు మేలు జరిగేలా పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే నిర్ణయించుకుంది.
ఈ రెండు పథకాల అమలు విధివిధానాలపై మరోసారి చర్చించి దసరా నాటికి ఈ రెండు పథకాలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.
ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!