ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న రైతు బంధు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని కష్టాల్లో ఉన్న,ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 5ఎకరాల పైబడి వరకు రైతు బంధు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు( Harish Rao) చేసిన సవాల్లను స్వీకరించి ఆగస్టు 15లోగా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చేయకుంటే ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు మాట ఇచ్చినట్లు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ కి మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేసి ఎక్కువ సీట్లు గెలిపించి సోనీయా గాంధీ కి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన కోరారు.

అదేవిధంగా రైతుబంధు రుణమాఫీ( Rythu Runa Mafi ) గురించి కార్యకర్తలు నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అభ్యర్థించి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్ల ను కోరారు.

బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ఇటీవల కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోయిన తెలంగాణ రైతాంగానికి ఎకరాన పదివేల రూపాయల చొప్పున 1086 ఎకరాల కు నష్టపరిహారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.

గత బిఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో నష్టపరిహారము అధికారులు సర్వే చేసి పేపర్ల పై రాసుకొని పోయారే తప్ప ఒక్క నయా పైసా రైతులకు నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదన్నారు.

యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ సాక్షి గా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేసి తీరుతారని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

బిఆర్ఎస్ పార్టీ పతనమయ్యే పార్టీ దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదన్నారు.అనవసరంగా బిఆర్ఎస్ పార్టీ కి ఓటు వేసి ఓటును వృధా చేసుకోవద్దన్నారు.

రాముని పేరు తో బిజెపి పార్టీ రాజకీయం చేయడం తప్పా రైతుల కోసం బిజెపి ప్రభుత్వం ఏం చేసిందని రైతులు ఒక్కసారి ఆలోచించాలని ఆయన కోరారు.

బిజెపి కాదు మేము కూడా రాముని భక్తులమేనన్నారు.బిజెపి పార్టీ రోడ్ల మీద తిరిగేటోల్లకు పనికొచ్చే పార్టీ తప్పా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే పార్టీ కాదన్నారు.

ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ తరువాత ఆరు గ్యారంటీ లు అర్హులకు ఖచ్చితంగా అమలుచేస్తుందనిపాలకులం కాదు సేవకులమని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ తప్పకుండా అమలు పరుస్తుందని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, యూత్ అధ్యక్షులు బానోత్ రాజు నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిది రాజేందర్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, రఫిక్, గంగన్న యాదవ్, నాయకులు బండారి బాల్ రెడ్డి ,నంది కిషన్ , మల్లయ్య , అనిల్ , నర్సింలు, గౌస్ బాయి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇస్రోకు నో చెప్పి 52 లక్షల ప్యాకేజ్ సాధించిన రైతుబిడ్డ.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!