సంక్రాంతి సినిమాలకు షాక్ ఇస్తున్న రేవంత్ రెడ్డి…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా పుష్ప 2 సినిమా ( Pushpa 2 Movie )రిలీజ్ రోజున జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పైన చాలా ఫైర్ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఆయన ఇకమీదట బెన్ ఫిట్ షోస్ కి పర్మిషన్ లేదు.అని తేల్చేసి చెప్పడంతో బెంబేలెత్తిపోయిన సినిమా పెద్దలంతా కలిసి ఆయనతో నిన్న మీటింగ్ ని అరేంజ్ చేశారు.
మరి ఈ మీటింగ్ లో ఆయన ఏం చెప్పారు.సినిమా ఇండస్ట్రీలోని పెద్దలతో జరిగిన ఈ మీటింగ్ లో ఇకమీదట చేయబోయే సినిమాలకు బెనిఫిట్ షోస్ ఉంటాయని చెప్పారా లేదా అనే అనుమానాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
అయితే ఆయన నిన్న జరిగిన మీటింగ్లో తను ఎలాంటి బెనిఫిట్స్ కి పర్మిషన్స్ ఇవ్వనని ఏదైతే అసెంబ్లీలో చెప్పానో ఆ మాట మీదే నిలబడతానని చెప్పడం విశేషం.
ఇక దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంతవరకు షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ముఖ్యంగా ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల విషయంలో మాత్రం ఇలాంటి నిర్ణయం భారీ దెబ్బగా మారబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.
"""/" /
ఇక ఏది ఏమైనా కూడా కొంచెం తేడా కొట్టినా కూడా సినిమాలు భారీ నష్టాలను మిగిల్చే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఈ సినిమా రిలీజ్ వరకి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఏమైనా తన డిసిజన్ ను మార్చుకొని బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
చూడాలి మరి సంక్రాంతి సినిమాల పరిస్థితి ఇక ఉండబోతుంది అనేది.
ఆ గుడికి వెళ్లిన తర్వాత వెంకటేశ్ జీవితమే మారిపోయిందట.. ఏ గుడి అంటే?