కదిలిన కేసు ! రేవంత్ ఇంటిపై కొనసాగుతున్న ఈడీ సోదాలు !

తెలంగాణాలో ఎన్నికల వేడి మొదలవ్వడంతో తమ రాజకీయ ప్రత్యర్థులపై అన్నిరకాలుగా విరుచుకుపడేందుకు పార్టీలు సిద్ధం అయ్యాయి.

దీనిలో భాగంగా.నాయకులపై పెండింగ్ లో ఉన్న కేసులను బయటకి తీస్తున్నారు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్.

కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే అసెంబ్లీ రద్దు అనంతరం తనపై దాడులు జరుగుతాయంటూ రేవంత్‌రెడ్డి చెరుపుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గురువారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది.హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు.ఈ నేపథ్యంలో అక్కడ ఏమి జరుగుతుందో అన్న టెన్షన్ ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 2015 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సెన్‌కు రూ.

కోటి డీల్‌ కుదిర్చారని రేవంత్‌పై గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.అప్పట్లో పక్కా సమాచారం అందుకున్నఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కేవలం రూ.

50లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.అయితే మిగిలిన మొత్తం కూడా బదిలీ అయిన విషయాన్ని ఏసీబీ గుర్తించలేదు.

కొద్దిరోజుల క్రితం ఈ కేసును ఏసీబీ అధికారులు ఈడీకి అప్పగించింది.ఇందులో భాగంగా ఈడీ అధికారులు రేవంత్‌రెడ్డి ఇళ్లతో పాటు కార్యాలయాలపై సోదాలు చేపట్టారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ పై యువతకు వీసీ సజ్జనార్ హెచ్చరిక