వారిపై రేవంత్ గుర్రు ? అధిష్టానం జోక్యం చేసుకోవాల్సిందేనా ?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పటికీ గందరగోళం లోనే నడుస్తోంది.

ఆయనకు పార్టీ అధిష్టానం పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం తో పాటు, అన్ని విషయాల్లోనూ మద్దతు పలుకుతున్నా ఆయనలో ఇప్పుడు అసంతృప్తి తీవ్రంగా పెరిగి పోయినట్టు కనిపిస్తోంది.

మొన్నటి వరకు రేవంత్ హడావిడిగా కనిపించినా, ఆయన జైలుకు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

దీనికి కారణం సొంత పార్టీ నాయకులే అన్న విషయాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి.

అసలు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై , కెసిఆర్ కేటీఆర్ పై ఉన్న ఆగ్రహం కారణంతోనే ఆ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ వేదికగా వారిపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయాలని చూశారు.అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల కారణంగా రేవంత్ దూకుడుకు ప్రతి దశలోనూ గండిపడుతోంది.

ముఖ్యంగా గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ దూకుడుకు పార్టీ సీనియర్లు అడుగడుగునా అడ్డం పడుతూ వస్తున్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు మింగుడు పడలేదు.

రేవంత్ దూకుడు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తమ ఉనికికే ప్రమాదం ఉంటుందన్న ఆలోచనతో చాలా మంది సీనియర్లు రేవంత్ విషయంలో రాజకీయాలు చేయడం వంటి కారణాలతో, ప్రతి దశలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు.

కొడంగల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన రేవంత్ ఆ తర్వాత మల్కాజిగిరి నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు.

అప్పటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆందోళన లు చేస్తూ కేసీఆర్, కేటీఆర్ అవినీతి వ్యవహారాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరాలు ఉపయోగించి చిత్రీకరించేందుకు ప్రయత్నించడం దానిపై పై ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

దీని కారణంగా రేవంత్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.అయితే జైలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎవరు ఆయన కనీసం పలకరించ లేదనే బాధ ఎక్కువ అయినట్టు తెలుస్తోంది.

"""/"/ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెచ్చే విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉద్యమాలు చేస్తున్నా సొంత పార్టీ నాయకుల నుంచి కనీసం మద్దతు లభించడం లేదనే బాధ ఎక్కువగా కనిపిస్తోంది.

ముఖ్యంగా వి.హనుమంతరావు, జగ్గారెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు తనను బాగా టార్గెట్ చేసుకున్నారని రేవంత్ నమ్ముతున్నారు.

అసలు తాను సైలెంట్ గా ఉండి ఉంటే జైలుకు వెళ్లే అవసరం ఉండేది కాదని, పార్టీ కోసం తాను ఇంత కష్టపడుతున్నా, తనను పట్టించుకునేవారు లేరని, అటువంటప్పుడు తాను ఎందుకు అనవసరంగా వివాదాల్లోకి వెళ్లి అన్ని రకాలుగా నష్ట పోవాలని రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయినట్టు సమాచారం.ఈ విషయంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని రేవంత్ మద్దతు ఇస్తూ పార్టీ సీనియర్లు బుజ్జగించి రేవంత్ సహకరించాల్సిందిగా సూచిస్తే తప్ప మళ్లీ యాక్తివ్ అవ్వకూడదు అనే ఆలోచనలో రేవంత్ ఉన్నారట.

దుల్కర్ లాంటి వ్యక్తి నా జీవితంలో ఉండడం నా అదృష్టం : మృణాల్ ఠాకూర్