CM Revanth Reddy : మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కే పరిమితం కాదంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్..!!

హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం( Telangana State Fire Services Headquarters ) ప్రారంభమైంది.

ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కే పరిమితం కాదన్న ఆయనన తెలంగాణ మొత్తానికి కావాలన్నారు.

జిల్లాల నుంచి హైదరాబాద్ కు రెండు గంటల్లో చేరుకునేలా ఉండాలని తెలిపారు.హైదరాబాద్ నుంచి ఫార్మాసిటీ తరలిపోలేదని పేర్కొన్నారు.

హైదరాబాద్( Hyderabad ) ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు.చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ 30 ఏళ్లుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ క్రమంలోనే డ్రైపోర్టు తీసుకురావాలనేది తమ విధానమని తెలిపారు.

పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!