కేసులతో కేసీఆర్ ఇరికిస్తుంటే సంతోషపడుతున్న రేవంత్

తెలంగాణాలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా, పక్కలో బల్లెంలా ఉంటూ వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త దూకుడు పెంచాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు పట్నం గోస అంటూ తెలంగాణాలో పర్యటిస్తూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడంతో రేవంత్ పై ఉన్న కేసులన్నింటినీ బయటకి తీస్తూ ఆయన్ను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

దీనికి నిదర్శనంగా గోపనపల్లి భూ అక్రమ వ్యవహారంలో రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ మరోసారి వెలుగులోకి తీసుకువస్తున్నారు.

ఇదే అంశంపై రేవంత్ రెడ్డి పట్నం గోస కార్యక్రమంలో స్పందించారు. """/"/కెసిఆర్ తనను భయపెట్టాలని చూస్తున్నారని, ఆయన ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను వెనక్కి తగ్గేది లేదని చెప్పుకొచ్చారు.

అసలు తనను ఇరికించేందుకు ఇప్పుడు భూ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారని, ఇటువంటి ఆరోపణలు, కేసులు ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని, క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీసిన ప్రతి సందర్భంలోనూ తనపై కొత్త కొత్త ఆరోపణలను చేస్తూ, పాత కేసులను ప్రభుత్వం వెలుగులోకి తెస్తోంది అని రేవంత్ అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం వారిది.పోలీసులు కూడా వారి ఆధీనంలోనే ఉన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి తగిన చర్యలు తీసుకోవచ్చు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

తనకు ఉన్న మొత్తం ఆస్తి పోయినా, చివరి ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ కు వ్యతిరేకంగానే పోరాడతానని, ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని రేవంత్ ఆవేశంగా మాట్లాడారు.

అలాగే 2005లో తాను ఆస్తులు కొనుగోలు చేస్తే 1978 లో రికార్డులు తారుమారు చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణలు చేసే ముందు కనీసం జ్ఞానం ఉండాలని ఆయన అన్నారు.

ప్రభుత్వం ఏం చేసినా, న్యాయస్థానాలు ఉన్నాయని, తన పై ఇప్పటికే 65 కేసులు పెట్టారని, ఎన్నికల సమయంలో తన ఇంట్లో కి పోలీసులు వచ్చి ఎత్తుకు వెళ్లారని, ఆ సమయంలో నేను కోర్టును ఆశ్రయిస్తే డీజీపీ కోర్టు చివాట్లు పెట్టింది అని రేవంత్ గుర్తు చేశారు.

"""/"/ప్రస్తుతం ఈ వ్యవహారంలో తనను ఇరికించాలని చూస్తున్నారని, తాను భయపడే రకం కాదని అన్నారు.

పట్నం గోస కార్యక్రమాన్ని మొదలు పెట్టగానే టిఆర్ఎస్ లో వణుకు మొదలయిందని, తనపై కేసులు విషయం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందని, వారు తనకు ఫోన్ చేసి ఈ విషయం గురించి ఆరా తీస్తున్నారని అన్నారు.

కెసిఆర్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనే నాయకుడు మీరేనని వారు ప్రశంసిస్తున్నారు అని రేవంత్ చెప్పుకొచ్చారు.

మొత్తంగా చూస్తే పట్నం గోస కార్యక్రమాన్ని చూసి టిఆర్ఎస్ భయపడుతోంది అన్నట్లుగా రేవంత్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతోంది.

అలాగే ప్రభుత్వం తనను కేసుల్లో ఇరికించాలని చూస్తుండడం వల్ల తన పరపతి మరింత పెరుగుతోందని రేవంత్ ఆనందంలో ఉన్నాడు.

వైరల్ న్యూస్: 760 ఏళ్ల జైలు శిక్షణ విధించిన కోర్టు.. అసలు మ్యాటరేంటంటే..